|
gurupriya
|
 |
« Reply #45 on: February 12, 2012, 10:33:55 PM » |
|
జై సాయి మాస్టర్! గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు ! అలివేలు మంగ పతి నీకిదే వందనం ! శ్రీ గురు గీత -7 వ శ్లోకం శ్లో !!కర్మణా మనసా వాచా సర్వ దారాధయేద్గురుం ! దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధౌ !! భావము :మనస్సు ,వాక్కు ,కర్మల చేత గురువును ఆరాదించవలసినది .సాష్టాంగముగ లజ్జ విడిచి గురు సన్నిధి యందు నమస్కరింప వలెను .మనస్సుతో ఆరాధించుట అనగా నామ స్మరణ మొదలుగునవి .వాక్కుచే ఆరాధించుట అనగా మాట్లాడ వలసి వచ్చినచో గురువు తో గాని ,గురువును గూర్చి గాని మాట్లాడుట .అన్యమును గూర్చి సాధ్యమైనంత వరకు మాట్లాడ కుండుట .ఆచరణ రూపమున సేవించుట అనగా ఈ దేహెంద్రియ ములన్నియు గురువునకు శుశ్రూష చేయుటకు ,గురు ఆజ్ఞా పాలనమునకు ,గురువునకు ప్రీతి కరమైనవి ఆచరించుటకు మాత్రమే వాడ వలసిన పవిత్రమైన పూజా పాత్రలుగా భావించి ,తుచ్ఛ విషయముల నిమిత్తము వాటిని వినియోగించి మాలిన పరచ కుండుట .ఆ భావన చెదర కుండా సర్వ జీవులను గురు రూపములు గనే భావించి సేవించుట .పూజ భజనాదికముల యందు శరీరమును వినియోగించుట . అలివేలు మంగ పతి నీకిదే వందనం ! జై సాయి మాస్టర్!
|
|
|
|
|
Logged
|
|
|
|
|
gurupriya
|
 |
« Reply #46 on: February 13, 2012, 09:05:40 PM » |
|
జై సాయి మాస్టర్! గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు ! అలివేలు మంగ పతి నీకిదే వందనం ! శ్రీ గురు గీత -8 వ శ్లోకం శ్లో !!శరీర మింద్రియం ప్రాణమర్ధస్వజన బాన్ధవాన్ ! ఆత్మ దారాధికం సర్వం సద్గురుభ్యో నివేద యేత్!! భావము :శరీరమును ,ఇంద్రియములను ,ప్రాణములను ,ధనమును ,భార్యా పుత్రాది స్వజనమును సద్గురువుకు నివేదించ వలెను . వివరణ :నివేదన అనగా గురు సేవ యందు వీనిని యుపయోగించుట .ఇవన్నియు ఆయన రూపముగనే తెలియ పరచు కొనుట .సద్గురువునే వీటన్నిటిగా భావించుట .చూచుట ,వినుట మొ :ఇంద్రియముల న్నింటిని గురు పరముగ చేయుట .ప్రాణములను నివేదించుట అనగా సృష్టి స్వరూపముగ ప్రాణ స్పందనము గురు స్వరూపముగా నెరిగి వాటి వలన జీవించు చున్నామను కృతజ్ఞతా భావ యుక్తముగా ఆయనను స్మరించుట .శ్వాసా దికములతో ఆయన నామమును సమన్వయ పరచుకొనుట.భార్య చేత సద్గురు సేవ చేయించ వలె .అది అతని ధర్మం .అంటే ఆమె అందుకే వున్నట్లు ఆమె చేత తీవ్ర గురు సేవా రూపమైన సాధన చేయించవలెను .సహా ధర్మ చారిణి గదా ఆమె !అట్టి విద్య వచ్చిన గురువైన భర్త నామె సేవిస్తే అతని సద్గురువును సేవించి నట్లే .సాయి శ్యామాను తన ప్రతినిధిగా భక్తుల ఇండ్లకు పంపినట్లు .సద్గురువు తన అర్చనావతారం గా భర్తను భార్య కిస్తాడు .భక్తునికి నామరూప రహిత పరబ్రహ్మ తన లీలా మానుష విగ్రహాన్ని గురువు రూపంగా ప్రసాదించినట్లు.ఇట్టి వారే తల్లి తండ్రులు . వారిని దైవ స్వరూపులుగా సేవించడం బిడ్డల ధర్మం అనడంలో ఆశ్చర్య మేముంది ?ఒక గురువు యొక్క శిష్యుడు తన శిష్యునకు గురువౌతున్నాడు గదా !ఇన్ని రీతులుగా అంతా విశ్వ చైతన్య రూపుడైన గురువేనని ,అంతా ఆయనదేనని గుర్తించ డాన్నే సాయి తామెల్లప్పుడూ చేసే "అల్లా మాలిక్ " అన్న స్మరణ ద్వారా సూచించారు .దక్షిణ కూడా ఇట్టి ఆత్మ సమర్పణే సూచిస్తుంది . అలానే చరమ దశలో భార్య ,భర్త లిద్దరూ అబేధ స్ధితికి రావాలి శక్తి చైతన్యాల్లాగా ,నిప్పు -వేడి లాగ .అది గృహస్త ధర్మం ఇందులో సుసిక్షితులై అన్యత్వ ద్రుష్టి పోయిన తరువాతనే లౌకిక ధర్మాలు రక్తి కడతాయి .మన పూర్వులు పురుషుడికి అన్యత ద్రుష్టి బ్రహ్మ చర్యం లో పోగొట్టేవారు .భార్యకు భర్త సేవలోనే ప్రౌఢ దశ లోపల అన్యత్వం పోయేది .ఆ లోపున తప్పని సరైతే కాని పురుషులను చూడరాదని మను మహర్షి చెప్పి యున్నారు .గార్హ్యస్దము ఒక తపశ్చర్య .అప్పుడే వివాహం లంపటం కాక సత్సాంగత్యం గా మారుతుంది ."యత్ర నార్యాస్తూ పూజ్యంతే రమంతే తత్ర దేవతా ".అన్న శ్లోకం అక్కడ సార్ధక మౌతుంది .'పూజ్యంతే ' అంటే ఇట్టి ఉత్తమ జీవిత విధానం స్త్రీ కిచ్చి గౌరవిస్తారో ,బానిస వలె ,వేశ్య వలె ,విలాసిగా మాత్రమే చూడరో -అని భావము .శ్రీ సాయి తమ గురువును సేవించిన విధము ఈ శ్లోకానికి తార్కాణము . అలివేలు మంగ పతి నీకిదే వందనము ! జై సాయి మాస్టర్!
జై సాయి మాస్టర్!
|
|
|
|
|
Logged
|
|
|
|
sai nandan
Newbie

Posts: 4
|
 |
« Reply #47 on: February 14, 2012, 03:49:37 AM » |
|
Jai Sai Master!!
GuruPriya garu now I understood that why our ancestors told that GRIHASTA ASHRAM is important in one's life. Thank you for posting.
|
|
|
|
|
Logged
|
|
|
|
|
gurupriya
|
 |
« Reply #48 on: February 14, 2012, 07:29:12 AM » |
|
జై సాయి మాస్టర్! గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు ! గురు బంధువు సాయి నందన్ గారికి ,"గురు కుటుంబాన్ని 'ఆశీస్సులు కోరుదాము గురు బంధువు లందరమూ ! జై సాయి మాస్టర్!
|
|
|
|
|
Logged
|
|
|
|
|
gurupriya
|
 |
« Reply #49 on: February 14, 2012, 07:54:55 PM » |
|
జై సాయి మాస్టర్! గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు ! అలివేలు మంగ పతి నీకిదే వందనం ! శ్రీ గురు గీత -9 వ శ్లోకం శ్లో :గురురేకో జగత్సర్వం బ్రహ్మవిష్ణు శివాత్మకం ! గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం!! . భావము :బ్రహ్మ ,విష్ణు ,శివాత్మకమగు జగత్తంతయూ గురువే .గురువు కన్న అధికము మరేదియు లేదు .అందువలన ఆయనను పూజించ వలెను . వివరణ :బాబా లీలలే ఈ శ్లోకానికి వివరణ .అట్టి ఆయన అద్భుత స్ధితిని శ్రద్దగా నిత్యమూ స్మరించిన అదియే సరైన పూజ . అలివేలు మంగ పతి నీకిదే వందనం ! జై సాయి మాస్టర్!
|
|
|
|
|
Logged
|
|
|
|
|
gurupriya
|
 |
« Reply #50 on: February 15, 2012, 07:27:36 PM » |
|
జై సాయి మాస్టర్! గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు ! అలివేలు మంగ పతి నీకిదే వందనం ! శ్రీ గురు గీత :10 వ శ్లోకం శ్లో :గురుర్బ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ! గురు స్సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః !! వివరణ :అంతటా వున్నది తానొక్కడే అను జ్ఞానము వలన గురువు బ్రహ్మ అగుచున్నాడు . మానవుల పరిమిత క్రియా సామర్ధ్య మునకు రెండు చేతులు సంకేతము .భగవంతుని సర్వ సమర్ధతకు ,అంటే అలౌకిక మగు లీలలను ప్రదర్సించగల సామర్ధ్యమునకు విష్ణువు యొక్క నాలుగు బాహువులు చిహ్నములు .నాలుగు బాహువులలో నాలుగు పురుషార్ధములను మానవుల కిచ్చి జగత్తును పాలించుటకు విష్ణువే సమర్ధుడు .అట్టి శక్తులనంతముగా కలుగుట వలన సద్గురువు విష్ణువగు చున్నాడు.మరియు విష్ణువు వలె గురువు సర్వ వ్యాపి . సర్వ భూత హృదయముల యందుండి వాటిని నడిపించు ప్రభువే ఈశ్వరుడు .సర్వ భూత హృదయములందుండు చైతన్యమే తానగుట వలన సద్గురువు ఈశ్వరుడగుచున్నాడు . ఈ మూడును తానే అగుట వలన ,మూడింటికిని అతీతుడు కావున గురువు సాక్షాత్తు పరబ్రహ్మము .అందువలన గురువునకు నమస్కారము . అలివేలు మంగ పతి నీకిదే వందనము ! జై సాయి మాస్టర్!
|
|
|
|
|
Logged
|
|
|
|
|
gurupriya
|
 |
« Reply #51 on: February 16, 2012, 08:16:53 PM » |
|
జై సాయి మాస్టర్! గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు ! అలివేలు మంగ పతి నీకిదే వందనం ! శ్రీ గురు గీత -11 వ శ్లోకం శ్లో :అఖండ మండలాకారం వ్యాప్తంయేన చరాచరం ! తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవేనమః !! భావము :ఎవని చేత చరా చర జగత్తంతయు వ్యాపింప బడి యున్నదో ఆయన ఆకారము అఖండ మండలము .అట్టి స్ధితి నాకు ఏ గురువు వలన తెలుప బడినదో అట్టి గురువునకు నమస్కారము . వివరణ :జగత్తులోని వస్తు ప్రాణు లన్నియు ఖండములు .ఒకదానికొకటి అన్యములు ,దేశ కాల భేదములు కలవి .అట్టి ఖండ స్వరూపులైన మనకు స్వయముగా ఇట్టి సృష్టికి ఆధారమై ,అఖండమై ,సర్వత్ర నిండిన ఒకే శక్తి చైతన్యములు న్నవన్న సంగతి తెలియ నవకాశము లేదు .అట్టి మనకు సర్వ శక్తి మంతుడు ,సర్వజ్ఞుడు ,సర్వవ్యాపియు ,సర్వ నియంతము అగు సద్గురువు తన అద్భుత లీలల చేత సృష్టి కాదారముగా ఒకే శక్తి వ్యాపించి యున్నదని నిదర్సనా పూర్వకముగా తెలియ చెప్పుచున్నారు .అట్టి స్ధితిని పొందుటకు మనకు సహకరిస్తున్న్నారు .అట్టి మహాత్ములే ఆధ్యాత్మిక విద్యను మానవులకు తెలుప కున్నచో మానవాళి కి ముక్తి పొందు అవకాశము లేకుండె డిది.అట్టి నిజమైన శ్రేయస్సు ఒక సద్గురువు వల్లనే కలుగుచున్నది .కనుక ఆయనే నమస్కరింప తగిన వారు .'తత్' అనిన పరబ్రహ్మ స్ధితి .దానిని తెలిపినవాడు సద్గురువొక్కడే. మరియు 'తత్ అను పదమున కర్దము వివరింప గల సద్గురుడాయనయే.ఈ శ్లోకము సద్గురువు ఉపదేశించు తత్వమసి (తత్ ,త్వం,అసి ) వేదాంత వాక్యమున మొదటి పదము సద్గురువు యొక్క స్ధితి ని ,ఆయనయే దాని చెప్పనర్హుడని తెలుపు చున్నది . అలివేలు మంగ పతి నీకిదే వందనం ! జై సాయి మాస్టర్!
|
|
|
|
|
Logged
|
|
|
|
|
gurupriya
|
 |
« Reply #52 on: February 17, 2012, 07:42:22 PM » |
|
జై సాయి మాస్టర్! గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు ! అలవేలు మంగ పతి నీకిదే వందనం ! శ్రీ గురు గీత -12 వ శ్లోకం : శ్లో :స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరా చరం ! తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవేనమః !! వివరణ :'స్ధావర జంగమాత్మక మైన ఈ జగత్తంతయూ వ్యాపించిన చైతన్య శక్తియే నీవు 'అని శిష్యునకుపదేశించుటలో పైన చెప్పబడిన వేదాంత వాక్యములందు రెండవ పదమును ఈ శ్లోకము వివరించు చున్నది .సద్గురువు అర్హులైన శిష్యులకు వాచా ఉపదేశించు టయే గాక అనుభవమును కూడా ప్రసాదించ గలరు .అట్టి అనుభవమును 'దర్శితం 'అను పదము సూచించుచున్నది .ఈ విషయమును సద్గురువు తప్ప మరెవ్వరును అనుభవ పూర్వకముగ బోధింప జాలరు .కనుక తదన్యముగ ముక్తికి మార్గము లేదు కనుక సద్గురువే నమస్కరింప దగిన వాడు. అలివేలు మంగ పతి నీకిదే వందనం ! జై సాయి మాస్టర్!
|
|
|
|
|
Logged
|
|
|
|
|
gurupriya
|
 |
« Reply #53 on: February 18, 2012, 08:04:05 PM » |
|
జై సాయి మాస్టర్ ! గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు ! అలివేలు మంగ పతి నీకిదే వందనం ! శ్రీ గురు గీత :13 వ శ్లోకం శ్లో :చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం ! నాద బిందు కళా తీతం తస్మై శ్రీ గురవేనమః !! భావము :అజ్ఞానాంధకార రహితమును , శాంతమును ,శాశ్వతమును ,ఆకాశమును కూడ గమనింపగలదియు తత్కారణముగ ఆకాశము కంటే సూక్ష్మమును అయిన చైతన్య స్వరూపుడును ,నాద బిందు కళలకు అతీతుడైన శ్రీ గురువునకు నమస్కారము . అలివేలు మంగ పతి నీకిదే వందనం ! జై సాయి మాస్టర్!
|
|
|
|
|
Logged
|
|
|
|
|
gurupriya
|
 |
« Reply #54 on: February 19, 2012, 08:01:03 PM » |
|
జై సాయి మాస్టర్! గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు ! అలివేలు మంగ పతి నీకిదే వందనం ! శ్రీ గురు గీత :14 వ శ్లోకము శ్లో :చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ! అసిత్వం దర్సతంయేన తస్మై శ్రీ గురవే నమః !! భావము :"చరాచరాత్మకమగు ముల్లోకములన్నియు దేనిచే వ్యాపించబడి ఉన్నవో అట్టి చైతన్యమయుడవు నీవెప్పుడు అయియేవున్నావు" అని చెప్పుటయేగాక శిష్యునకు అనుభవమును ప్రసాదించిన గురువునకు నమస్కారము . అలివేలు మంగ పతి నీకిదే వందనము ! జై సాయి మాస్టర్!
|
|
|
|
|
Logged
|
|
|
|
|
gurupriya
|
 |
« Reply #55 on: February 20, 2012, 08:03:39 PM » |
|
జై సాయి మాస్టర్! గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు ! అలివేలు మంగ పతి నీకిదే వందనం ! శ్రీ గురు గీత :15 వ శ్లోకం శ్లో :సపితా సచమే మాతాసబంధుస్సచ దేవతా ! సంసార మొహనాశాయ తస్మైశ్రీ గురవే నమః !! వివరణ :అంతటా వున్న ఒకే చైతన్యమును అజ్ఞానముచే గుర్తించ లేక తల్లియని ,తండ్రియని ,బంధువులని ,దేవతలని ,వారి మీద సహజముగా వుండునట్టి ప్రేమనంతటినీ ఒక్క గురునికే సమర్పించుట ఈ శ్లోకము వివరించుచున్నది .గురువే తల్లిగను తండ్రిగను ప్రేమించుకొనుట ఈ శ్లోకము నందలి ఒక అంశము .తల్లితండ్రుల రూపమున వ్యక్తమగుచున్నది .సర్వవ్యాపియగు యగు గురువు ఒక్కడే అను యెరుక చేత తల్లి ,తండ్రుల యెడల మానవుడనుభవించు వ్యామోహము నశింపచేసుకొనుట రెండవ అంశము .తన గురువు సన్నిధిలో తన తల్లి ,తండ్రులను ,ఆకలిదప్పులను విస్మరించామని శ్రీ సాయి చెప్పినది స్మరణీయము . అలివేలు మంగ పతి నీకిదే వందనం ! జై సాయి మాస్టర్!
|
|
|
|
|
Logged
|
|
|
|
|
gurupriya
|
 |
« Reply #56 on: February 21, 2012, 07:46:17 PM » |
|
జై సాయి మాస్టర్! గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు ! అలివేలు మంగ పతి నీకిదే వందనం ! శ్రీ గురు గీత :16 వ శ్లోకం శ్లో :యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్! యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః !! భావము :దేనియొక్క ఉనికి చేత ఈ జగత్తున్నదని కలుగుతున్నదో -(కుండ యొక్క ఉనికికి మట్టి యొక్క ఉనికి ఆధారమైనట్టు ,భావన యొక్క ఉనికికి మనస్సాధారమైనట్టు) దేని యొక్క ప్రకాశము చేత జగత్తునందలి వస్తువులు వ్యక్తమగుట అను గుణము కలిగియున్నవో ,ఏ ఆనంద స్వరూప మగుట వలన జగత్తు నందలి జీవులు ఆనందము ననుభవించ గలుగుచున్నవో అట్టి శ్రీ గురువునకు నమస్కారము . వివరణ :గురువు సత్ చిత్ ఆనందస్వరూపుడని చెప్పుకున్నాము .విశ్వమునకాధారమగు చైతన్యము సత్ అని చెప్ప బడినది .దానికి అన్యత్వ వికారములు లేనందున అది పరమ శాంతి ,ఆనంద స్వరూపము .అదియే మనకి సృష్టి రూపమున గోచరించుచున్నది .అది సత్ పదార్ధము కావున దాని రూపమగు ఈ జగత్తు అస్తిత్వము కలిగి యున్నది . చైతన్యము స్వయం ప్రకాశము .దాని ఉనికిని తెలుసుకొనుటకు ఏ ఉపకరణము అవసరములేదు .అది దానంతటదియే అనుభవమగుచుండును. దాని రూపమగు విశ్వమునకు అందువలననే వ్యక్త మగుట అను గుణము కలదు . ఒక సాదృశ్యము: మన మనస్సు మరే ఉపకరణము లేకయే మనకనుభవమగుచుండును . అందుద్భవించిన ఊహా స్వప్నాదులు మరే ఉపకరణమవసరములేకయే మనకు గోచరించును .అట్లే ఇదియును . అలివేలు మంగ పతి నీకిదే వందనము ! జై సాయి మాస్టర్!
|
|
|
|
|
Logged
|
|
|
|
|
gurupriya
|
 |
« Reply #57 on: February 22, 2012, 07:57:15 PM » |
|
జై సాయి మాస్టర్! గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు ! అలివేలు మంగ పతి నీకిదే వందనం ! శ్రీ గురు గీత :17 వ శ్లోకం శ్లో :యస్మిన్ స్ధితమిదం సర్వం భాతియద్భానరూపతః ! యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవే నమః !! భావము :ఈ సకల జగత్తు ఎవని యందైతే ఉన్నదో ,ఎవని వెలుగుచేత భాసింపజేయబడుచున్నదో, ఎవరి ఆనంద తత్వము చేత పుత్రాదులు జీవులకు ప్రీతి పాత్రులగుచున్నారో అట్టి గురువునకు నమస్కారము . వివరణ :ఈ శ్లోకమున(1 )యత్సత్యేన జగత్సత్యం అన్న దానికి (2 )యత్ప్రకాశేనభాతియత్ అన్నదానికి (3 ) యదానందేన నందంతి అన్నదానికి వివరణలు సమ్మేళనము గావించబడినవి .ఈ నిఖిల జగత్తు ఏ విశ్వ చైతన్యము యొక్క భావనో అది దాని యందుండును.మనస్సునందుత్పన్నమైన ఊహలు మనస్సులోపలె ఉండునటుల సాయి కూడా అఖిల విశ్వము తనలోనే కలదని చెప్పిరి .అనగా ఆయన విశ్వరూపముననే కాక ఆ రూపమును ధరించకుండా ఉన్న అవ్యక్త చైతన్య రూపము కూడా వారే అయి వున్నారు -మనస్సు ఊహల రూపముననే కాక వాటిననుభవించు,సాక్షి చైతన్యముగ కూడ ఉన్నట్లు -మెలుకువ లోని కార్య రూపములు స్మృతి సంస్కార రూపమున మనస్సునందు నిలిచి స్వప్నావస్దయందు అది వాస్తవమన్నట్టు వస్తు రూపములుగా ననుభూత మగుచున్నదో ,అటులనే ఇంతకు ముందు సృష్టి ప్రళయకాలమున ,సంస్కార రూపమున విశ్వ చైతన్యములో దాగి యుండి తిరిగి సృష్టి కాలమున వస్తు రూపములైనట్లు గోచరించుచున్నది. విశ్వ చైతన్యమందలి సంస్కారములే మనకు వస్తు రూపమున అనుభవమగుచున్నవి .కాని వాటి వస్తుత్వము నిజాము కాదని ,అన్నీ చైతన్యముచేత చేయబడిన సంస్కారములే యని ఎరుగుటయే 'బ్రహ్మ సత్యం ,జగన్మిధ్య 'అను జ్ఞానమును పొందుట .దానికి ఉపకరించ గలిగినది సద్గురుడే కనుక వారికి నమస్కారము . అలివేలు మంగ పతి నీకిదే వందనం ! జై సాయి మాస్టర్!
|
|
|
|
|
Logged
|
|
|
|
|
gurupriya
|
 |
« Reply #58 on: February 23, 2012, 08:07:22 PM » |
|
జై సాయి మాస్టర్! గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు ! అలివేలు మంగ పతి నీకిదే వందనం ! శ్రీ గురు గీత :18 వ శ్లోకం : శ్లో :ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ! జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవే నమః !! భావము :ఏ గురువు మన హృదయములందు సాక్షి రూపుడై ఈ సర్వమును చూచుచున్నాడో ,మరియు మనస్సు ,బుద్ధి చిత్తము మొ :మానసిక శక్తులు ఏ సాక్షి చైతన్యము వలన పని చేయగలుగుచున్నవో ,ఏ సాక్షి చైతన్యము జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్ధలను మూడు స్దితులను గుర్తించుచున్నదో అట్టి సాక్షి యగు గురువునకు నమస్కారము అలివేలు మంగ పతి నీకిదే వందనం ! జై సాయి మాస్టర్!.
|
|
|
|
|
Logged
|
|
|
|
|
gurupriya
|
 |
« Reply #59 on: February 24, 2012, 08:46:23 PM » |
|
జై సాయి మాస్టర్! గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు ! అలివేలు మంగ పతి నీకిదే వందనం ! శ్రీ గురు గీత :19 వ శ్లోకం శ్లో :యస్య జ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదత:! సదైక రూప రూపాయ తస్మైశ్రీ గురవేనమః !! భావము :ఏ చైతన్యము చేత విశ్వమంతయు తెలియబడుచున్నదో అట్టి చైతన్య స్వరూపుడగు గురువునకు నమస్కారము మరియు సత్యమైన ఏ ఏక చైతన్యము నందు 'చూచువాడు ' 'చూడ బడునది ' అని భేదములు (లేక ఈ ప్రపంచము నందలి భేదములు ) అసత్యములని తెలియబడుచున్నదో అట్టి చైతన్య స్వరూపుడగు గురువునకు నమస్కారము . వివరణ :సామాన్యుల అనుభవములు ,అనుభవింపబడు విశ్వము వేరుగను,దానిననుభవించు తమలోని చైతన్యము వేరుగను అనుభవమగుచున్నది .కాని ఇవి రెండును రెండుగా గుర్తించుచున్న చైతన్య మేదియో దాని స్వరూపుడయిన గురువునకు నమస్కారము ."నేను జగత్తును గుర్తించువాడను .అది నాకు అన్యము ,బాహ్యము అయి నాచే అనుభవింపబడునట్టి జగత్తు " అను రెండు భావములు ఏ ఒక్క చైతన్యము నందుద్భ వించుచున్నవో ఆ చైతన్య స్వరూపుడయిన గురువునకు నమస్కారము . అలివేలు మంగ పతి నీకిదే వందనం ! జై సాయి మాస్టర్!
|
|
|
|
|
Logged
|
|
|
|
|