saimasterforums
 
*
Welcome, Guest. Please login or register. May 21, 2012, 03:33:15 AM


Login with username, password and session length


Pages: 1
  Print  
Author Topic: Manasa Bhajare Guru Charanam  (Read 125 times)
0 Members and 2 Guests are viewing this topic.
gorthi
Jr. Member
**
Posts: 76


« on: October 30, 2010, 11:38:00 AM »


Master gari Jayanthi Mahotsva subha-akanshalu to all Guru Bandhus.

I feel fortunate to know about Master garu, and for able to read his invaluable books.
Without Master gari guidance, I could not imagine how my life would have been.
On this auspicious occasion of His Jayanthi, I would like to recollect (స్మరణ) at least some of those things that Master garu has done for the whole humanity, for which we could never repay Him.


పుంతంబాకు చెందిన గంగగిర్ అనే గృహస్థ సాధువు, బాబా గురించి తన భక్తులతో, "పేడకుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లబించింది? ఈయన సూర్యుని వంటివారు. మీరు పిచ్చివాళ్ళు గనుక ఆయనను విడిచి ఎక్కడెక్కడో వెదుకుతున్నారు" అన్నారు. అలానే, శ్రీ అక్కల్కోట స్వామి శిష్యులైన శ్రీ ఆనంద స్వామి, బాబా గురించి, "ఈయన సామాన్యమయిన రాయిలా కనిపించినా, గొప్ప వజ్రం" అన్నారు. ఒకవేళ మాస్టారు గారు సాయినాథుని గురించి, ఆయన బోధల గూర్చి, సాయినాథుని ప్రతి చర్య గురించి అంత సవివరంగా తెల్పకుంటే, ఆయన ఎంత గొప్ప వజ్రమైనా, పేడకుప్పలాంటి నాలాంటి వాడికి, సాయినాధుడు కుడా ఒక  సామాన్యమయిన రాయిలాగే కనిపించి ఉండేవాడు. సాయినాథుని గురించి కనీసం ఇప్పుడు కలిగిన పాటి అవగాహనలో పదవ వంతు కూడా కలిగి ఉండేది కాదు.

సాయి లీలామృతంలో సద్గతి అనే అధ్యాయంలో, "... మిగిలిన అందరమూ అనేక జన్మలు ఎత్తేవాళ్ళమే గనుక ఆయన రక్షణ మనకు ప్రతీ జన్మలోను అవసరమే. అది అందించ గల్గడమే ఆయన విశిష్టత" అంటారు. అటువంటి జన్మ జన్మలలోనూ రక్షించే సాటిలేని సద్గురువైన సాయినాధుని ఇంతమాత్రమైనా ఆశ్రయించ గలగడానికి కారణం మాస్టారు గారే.

సాయి లీలామృతం ముందుమాటలోమాస్టారు గారు, "...... శ్రీ శివనేసన్ స్వామి సహాయంతో వివిధ భాషలలోని సాయి చరిత్ర గ్రంథాలు, పత్రికలలోని భక్తుల అనుభవాలు విన్నాక, వెనుక నేను చదివిన మహాత్ముల చరిత్రలలో - (వేరు వేరు మతాలకు చెందిన వారి) - పోల్చిచూస్తే, ఇంతటి మహాత్ముడు చరిత్రలో యింతవరకూ అవతరించలేదని, ఈయన యుగావతారమనీ తోచింది. ఈయన చరిత్రలో నేటి ప్రపంచం ఎదురుకుంటున్న సమస్యలన్నింటికి పరిష్కారం వున్నదనిపించింది. మనం సాయి భక్తులవ్వడం ఎంతటి పూర్వ పుణ్యమో తెలియాలంటే, ఆయన లీలలను కూర్చవలసిన విధానం వేరొకటి వున్నదని తోచింది. దానిని అందరితో పంచుకోవాలన్న ఆరాటమే ఈ రచనకు కారణం." అంటారు. మాస్టారుగారు అంత కష్టపడి సాయి లీలామృతం, సాయి ప్రభోదామృతము, సాయి సన్నిధి వంటి అమూల్య గ్రంధాలను ఇవ్వకుంటే, ఒక వేళ మనం సాయినాధుని ఆశ్రయించినా కుడా, మాస్టారు చెప్పినట్లు "జేబులో వంద రూపాయలు పెట్టుకుని డబ్బులు పోయాయనుకున్న వాడివలే," ఈమాత్రం స్థిరత్వము, అవగాహనైనా ఉండేవి కాదు.

మాష్టారు గారు మనకు ఎంతటి భద్రమైన మార్గాన్ని మనకు ప్రసాదించారో కదా. ఆధ్యాత్మిక అంటే ఏమిటో, నిజమైన మహాత్ములు ఎలా వుంటారో మాస్టారు గారు తెలపకుంటే, చాలా మందిమి ప్రక్కదారి పట్టడం, నకిలీ సాధువులను ఆశ్రయించడం చేసి వుండేవారమేమో? దీనిని గురించే మాష్టారు గారు సాయి లీలామృతంలో, "సాయి లీలను మాత్రమే పొందుపరచుకోవడం వలన ఆయన భోధ అసమగ్రంగా ప్రజలకు అందుతున్నది. ఉదాహరణకు, కుసాభావుకు సంభందించిన లీల బి. వి. నరసింహస్వామి గ్రంధంలో తప్ప ఎందులోనూ లేదు. దివ్యదృష్ఠి సహాయంతో ఎక్కడో, ఎప్పుడో జరుగనున్న సంఘటనలను తెలుసుకుంటున్న ఒక భక్తుణ్ణి సాయి 'మనకు ఈ వేశ్యతో ముద్దులాట తగదు' అని మందలించిన లీలకుడా చాలా గ్రంధాలలో లేదు. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని సాయిభక్తులను భ్రమింపజేస్తూ వుండడము చూడవచ్చు. ఏకాలంలోనైనా, ఆధ్యాత్మికత, ప్రజలు, సాధకులు గూడా భ్రష్ఠులైనది వీటివల్లనేనని చరిత్ర చూస్తే తెలుస్తుంది."

రెండున్నర దశాబ్దాల పాటు నిరంతర కృషి చేసి (మాస్టారి మాటల్లో, "సాయి పిచ్చి పట్టినట్లు కృషి చేసి"), మనలను బాగు చెయ్యడానికి ఎన్ని రకాలుగా వీలుందో అన్ని రకాలుగా ప్రయత్నిచారు. సాయి లీలామృతము, గురు చరిత్రలతోపాటు వివిధ మహాత్ముల చరిత్రలను అందించారు. ఆ మహాత్ముల బోధలను విశ్లేషిస్తో సాయి ప్రభోదామృతం, సాయిమాస్టర్ ప్రవచనాలు వంటి గ్రంధాలను ఇచ్చారు. అంతటా వున్న చైతన్యాన్ని భావన చేయడానికి మనకు ఆసరాగా ధ్యానయోగసర్వస్వంలాంటి అద్భుత గ్రంధాలను వ్రాసారు. వీటికి తోడు, ఏది నిజం?, మతం ఎందుకు, విజ్ఞాన వీచికలు వంటి సాటిలేని గ్రంధాలు ఇచ్చారు. మాష్టారుగారి జన్మదిన సందర్భంగా, మాష్టారుగారు పడిన ఇంత శ్రమను చూసి అయినా, నా వైపునుండి, మాష్టారుగారు ఆనందించే విధంగా జీవించడానికి కనీస ప్రయత్నమైనా  చేసేటట్లు చేయమని మరలా మాస్టారుగారినే మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను.

మానస భజరే గురు చరణం - దుస్తర భవసాగర తరణం.
« Last Edit: May 19, 2011, 04:44:10 AM by gorthi » Logged
NagaChaithanya
Newbie
*
Posts: 5



« Reply #1 on: November 02, 2010, 09:27:03 AM »



మానస భజరే గురు చరణం - దుస్తర భవసాగర తరణం
.
Logged
Pages: 1
  Print  
 
Jump to:  

Powered by MySQL Powered by PHP Powered by SMF 1.1.15 | SMF © 2011, Simple Machines

All information in these boards is copyrighted to Sri Ekkirala Dwarakanath Jnaneswar.
Valid XHTML 1.0! Valid CSS! Based onDilber MC Theme by HarzeM And customized by Sai Master Forums Team