saimasterforums
 
*
Welcome, Guest. Please login or register. May 21, 2012, 03:15:09 AM

Login with username, password and session length

Pages: « 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 »
  Print  
Author Topic: Daily Inspirational quotes of Master Garu!!!  (Read 4737 times)
Krishna@Jai sai master and 4 Guests are viewing this topic.
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #225 on: February 20, 2012, 05:48:03 PM »

జై సాయిమాస్టర్!

సాయిసూక్తి: "వాడాలో దొంగలున్నారు జాగ్రత్త."

ఆచార్యవాణి: "ఎన్ని కష్టాలు తీర్చినా ఎన్ని కోరికలు నెరవేర్చినా మనసులోని నైతిక బలహీనతలు తొలిగించుకోకుంటే అవి బలీయమై, మరుజన్మలో కూడా మనల్ని వెంటాడి ఎందుకూ పనికిరాని వానిగా మారుస్తాయి. ఇప్పుడు శక్తివంచన లేకుండా వాటిని తొలగించుకోటానికి ప్రయత్నిస్తే - అలా యత్నం చేసే సంస్కరణ మనతోపాటే మరుజన్మలో కూడా వచ్చి మన ప్రయత్నం సుగమం అయ్యే సులువు లభిస్తుంది."

సాయిసూక్తి-ఆచార్యవాణి, pg.48

http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Sai-Sukthi-Acharyavani&page=48

జై సాయిమాస్టర్!

« Last Edit: March 17, 2012, 10:48:24 PM by Admin_smf » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #226 on: February 21, 2012, 09:06:52 PM »

Jai Sai Master!

" It is always untruth that tries to look like truth. Truth does not look like anything else, and perhaps not even like itself.
  Therefore it is so difficult to discover it, but so easy to cover it up."

SaiBaba and His Teachings, pg.66

http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Sai-Baba-of-Shirdi-and-His-Teachings&page=66

Jai Sai Master!
 
« Last Edit: March 17, 2012, 10:49:00 PM by Admin_smf » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #227 on: February 23, 2012, 07:43:35 AM »

జై సాయిమాస్టర్!

" ఆత్మ జ్ఞానానికి పూర్ణుడైన సద్గురువుయొక్క అనుగ్రహము అవసరము. శ్రీ సాయి చెప్పిన తమ గురుసేవా వృత్తాంతము దీనికి తార్కాణము."

శ్రీ సాయిలీలామృతము,pg.257

http://www.saibharadwaja.org/books/saileelamruthamu/saileelamruthamu.aspx?chapter=28

జై సాయిమాస్టర్!

Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #228 on: February 23, 2012, 08:08:06 AM »

జై సాయిమాస్టర్!

'మనకు కావలసిన స్నేహితులు వచ్చి ఒక్క లారీ సామాను మన చిన్న గదిలో కుక్కినా ఇంకా ఏమైనా సామాను వుంటే తెచ్చిపెట్టుకోండి అని ఎంతో సంతోషంగా చెబుతాము.

అదే ఎవరో వచ్చి ఈ సంచి మోయడం మాకు ఇబ్బందిగా ఉంది. దీన్నిక్కడుంచండి, ఒక గంట తర్వాత తీసుకుపోతాము అని అంటే, అబ్బే వీలులేదండీ, మాకే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడికి పదిమంది వస్తూ పోతుంటారు. వీలుకదండీ అని చెప్పి తప్పుకుంటాము. వీరికి ఇలాంటి సమాధానం చెప్పేందుకు అడ్డంకు అంతరంగంలో ఉంది. దాన్ని తొలగించుకోవాలి. అందరిలో సాయిని చూడడం వారికి సహాయపడడం  నేర్చుకోవాలి. అలా చేస్తుంటే మన అంతరంగంలోని అడ్డంకు కొన్నాళ్ళకు తప్పక తొలుగుతుంది. అందుకు సాయి తప్పక సహాయం చేస్తారు. అందుకు మన inner efforts అవసరం.'

నాకు తెలిసిన మాస్టారు, pg.57(అడ్డంకు అంతరంగంలోనిది)

జై సాయిమాస్టర్!   
« Last Edit: February 23, 2012, 08:09:44 AM by saimaster_eb » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #229 on: February 24, 2012, 01:38:19 PM »

జై సాయిమాస్టర్!

"మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకు తెలుస్తుంది. అలా మనలో అన్నీ తెలుసుకొనేది సాయియే."

శ్రీ సాయిలీలామృతం, pg.42

http://www.saibharadwaja.org/books/saileelamruthamu/saileelamruthamu.aspx?page=25

జై సాయిమాస్టర్!
Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #230 on: February 25, 2012, 09:31:24 PM »

Jai Sai Master!

"Annihilating tendencies of mind to the wander, in the fire of dhyana is real Yajna according to the Bhagavatgita and the symbolism of Baba's dhuni. He is the fire; our notions of difference are the firewood. The resultant seeing Baba in all is fueling catching fire. Seeing Baba only always and everywhere is the udhi, the indestructible one residue or essence of all 'things' i.e.,jnana and Atma and hence that is dear to Baba Siva and he wears it and gives it. It awakens latent samskaras to do the Yajnya in his devotee....."

Jai Sai Master!
Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #231 on: February 26, 2012, 09:58:59 PM »

Jai Sai Master!

.......the wise Guru knew better and gave what he deemed his best for the disciple and not what the disciple craved for.

SaiBaba of Shiridi and His Teachings, pg.71

http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Sai-Baba-of-Shirdi-and-His-Teachings&page=71

Jai Sai Master!
« Last Edit: March 17, 2012, 10:49:40 PM by Admin_smf » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #232 on: February 27, 2012, 07:35:37 PM »

జై సాయిమాస్టర్!

'సృష్టి' అంటే ఇది వరకు లేని దానిని కల్పించడమనిగాక,సంస్కారాల రూపంలో పరమాత్మయందు దాగియున్నదానిని ప్రకటం చేయడమే.

సంహితాయన గురు ద్విసహస్రి, pg.02

జై సాయిమాస్టర్!

« Last Edit: February 27, 2012, 07:37:51 PM by saimaster_eb » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #233 on: February 28, 2012, 08:16:34 PM »

జై సాయిమాస్టర్!

"సాధన చెయ్యడానికి బాహ్య పరిస్థితులు అడ్డొస్తున్నాయని, సాధన వృద్ధి చెందకపోవడానికి బాబా దయ బాగుగ తమ మీద లేకపోవటమేనని, వాపోతారు కొందరు. కానీ అది సరికాదు. ఆయనకృప ఎప్పుడూ మన మీద కుండపోతగా వర్షిస్తూనే యున్నది. మన అహమే దాన్ని అనుభవవించనీయకుండా గొడుగులా అడ్డుకుంటుంది. ఈ అడ్డాన్ని తొలగించడమే చేయాల్సింది. సాధన స్విచ్ వంటిది. కరెంటు వున్నా స్విచ్ వెయ్యకపోతే లైటు వెలగదు. సాధనకు దోహదం బాహ్య పరిస్థితులలో మార్పు ఎప్పటికీ కాదు. మనలోని బలహీనతలే బాహ్య మైన అడ్డంకులుగా అనిపిస్తాయి. ఈ 'లోపల' అడ్డంకులు పొతే బాహ్యమైన అడ్డంకులు పోతాయి. ఏ విధంగా పరిస్థితులు మారితే సాధనకు బాగుంటుందనుకుంటామో, ఆ పరిస్థితి కావాలన్న కోరికే అంతరాయాలను ఆ పరిస్థితిలలోనూ సృష్టించుకుంటుంది. అసలు ఆమాట కొస్తే బాహ్యాన్ని గుర్తించడమే సాధనకొక పెద్ద అంతరాయం. బాహ్యాభ్యంతరాలను విస్మరించడమేగదా సాధన? కాబట్టి హృదయపూర్వకమైన నిశ్చయంతో సాధన చేస్తూ వుంటే మనలో వుండే అడ్డంకులు తొలగటం ద్వారా సాధన యింకా నిరాటంకమవుతుంది. కాబట్టి సాధనను అభివృద్ధి చేసేది సాధనే తప్ప ఇంకేమీ కాదని తెలుసుకోవాలి."

ధ్యానయోగ సర్వస్వం, pg.103

జై సాయిమాస్టర్!

Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #234 on: March 01, 2012, 11:40:30 AM »

జై సాయిమాస్టర్!

"తత్త్వ చింతన, భక్తి కలిసే కొనసాగాలని శాస్త్రం."

సాయినాధపూజ, iv.

http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Sainatha-Pooja&intropage=iv

జై సాయిమాస్టర్!
« Last Edit: March 17, 2012, 10:50:05 PM by Admin_smf » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #235 on: March 01, 2012, 11:42:14 AM »

జై సాయిమాస్టర్!

"ప్రాచీన జీవిత విధానము ముక్తి లేక జ్ఞానము జీవిత లక్ష్యంగా కలిగియుండేది. మనస్సును అనుక్షణము మారుతూండే కోరికల ప్రభావం నుండి విడుదలచేసి, అన్ని విషయాలలో ఒకానొక ఏకాగ్రత, తదనుశ్రుతమైన ధర్మానికి కట్టుబడడం సంస్కారానికి పట్టుకొమ్మగా నిలిచాయి. గురువుపట్ల శిష్యుడాచరించవలసిన ధర్మాలు గురుగీతలోనివి, గురుచరిత్రలోనివీ-పతివ్రతా ధర్మాలనెంతగానో పోలివుంటాయి. ఆధ్యాత్మిక రంగంలో ఇష్టదేవతకు, వివాహంలో ఒక జీవిత సహచరికి, తక్కిన జీవితమంతటిలో ఋషిప్రోక్తమైన ధర్మానికీ కట్టుబడడమే లక్ష్యం......"

శ్రీ గురుచరిత్ర, గురుచరిత్రలో స్త్రీనింద.

జై సాయిమాస్టర్!
Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #236 on: March 02, 2012, 01:09:42 PM »

జై సాయిమాస్టర్!

మన ఆంధ్రదేశంలో యీనాడు శిరిడీ సాయి ప్రచారమెంతో విస్తారంగా జరుగుతున్నది. ఎందరెందరో ఆయన లీలలవలన ఆకర్షించబడి శిరిడీ వెళుతున్నారు. అయినప్పటికీ మహారాష్ట్ర దేశంలోని భక్తులు శ్రీ సాయిని ఆరాధించటానికీ, మనలో ఎక్కువమంది ఆరాధించటానికీ ఎంతో వ్యత్యాసమున్నది. యిచటి విధానం, మన జీవితాలనే పాత యిళ్ళకు పైపైన సున్నం కొట్టడం లాంటిది; మహరాష్ట్ర దేశం లోనిది - ఇల్లంతటినీ పునాదులదగ్గరనుంచీ తిరిగి నిర్మించడం లాటిది. నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో అడుగు బెట్టడమంటే మన పాత జీవితము, మనస్తత్త్వమూ మొత్తంగా తిరిగి నిర్మించుకొనడం వంటిదేనని, మరలా జన్మించడంలాంటిదేననీ ఋషులందరూ చెప్పారు.

దత్తావతార మహత్యము, ముందుమాట.

జై సాయిమాస్టర్!

Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #237 on: March 03, 2012, 03:36:29 PM »

జై సాయిమాస్టర్!

అటు ఎలక్ట్రాన్ ప్రోటాన్ వంటి అతి సూక్ష్మమైన వాటినుంచీ అతి పెద్ద నక్షత్రకోవదాకా అన్నీ ఒకే పదార్ధంతో - అంటే శక్తి తరంగాలైన పరమాణువులతో చేయబడిఉన్నాయన్న  సంగతి జ్ఞాపకం రాగానే ఎంతో ఆశ్చర్యంగానే వుంటుంది. కాని యిలా తెలుసుకొన్నంతమాత్రాన అన్వేషణ పూర్తికాదు. అలా చర్చించి అవగాహన చేసుకొన్న సత్యాన్ని అనుష్టించి అనుభవగతం చేసుకోవాలి.

ఏదినిజం, pg.17

http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Edi-Nijam&page=17

జై సాయిమాస్టర్!

« Last Edit: March 17, 2012, 10:50:27 PM by Admin_smf » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #238 on: March 04, 2012, 06:05:45 PM »

జై సాయిమాస్టర్!

మనం కొలిచే మూర్తిలో మనచేత కొలవబడేది అన్నింటిలోనూ వ్యాపించి, సర్వ భూతముల హృదయాంతర్వర్తియైన విశ్వచైతన్యం. అదే మన హృదయంలో ఉంది. ఎలా ఉంది? సాక్షిగా  ఉంటుంది. అంటే దాని రూపం 'చూడడం'. దాన్ని అనుభవిస్తుంటే సర్వవ్యాపకుడూ, సర్వ భూత హృదయాంతర్వర్తీ అయిన ఆ శుద్ధచైతన్యమూర్తినే అనుభవించినట్లు. కనుక సగుణ సాకారమూర్తిని చరిత్ర పఠణ, నామస్మరణ, దర్శన, పూజనాదికాలతో ఆరాధించడానికి మనస్సు విముఖంగా ఉన్న మూడ్ లో అందుకు కలిగే మనోవికల్పాలను, యత్నిస్తున్న మననూ, చుట్టూ జగత్తునూ చూచే 'చూపు' ను గుర్తిస్తే చిత్తం నిలుస్తుంది. దానివల్ల సగుణ సాధన కూడా బలీయమవుతుంది. సగుణసాధన, నిర్గుణ సాధనలు ఒకదానివల్ల ఇంకొకటి పటిష్టమవుతాయి. కనుక రెండింటినీ సాధకుడు అభ్యసించటం చాలా శ్రేష్టం.

ధ్యానయోగ సర్వస్వం, pg.109

జై సాయిమాస్టర్!
         
Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319

I Love my Master

« Reply #239 on: March 05, 2012, 02:32:02 PM »

జై సాయిమాస్టర్!

"శ్రీ సాయివంటి సద్గురువుపై భక్తిశ్రద్ధలు కలగడం ఎంతో అదృష్టం. కాని అటుపైన పొడుగునా మనకు ఆయన తోడుగా వుండి సరియైన మార్గంలో నడిపించాలంటే ఏం చేయాలి? " నాపై నీ దృష్టి నిలుపు. నీపై నా దృష్టి నిలుపుతాను" అన్నారు సాయి. ఆయన గురించి అనన్యంగా చింతన చేసిన వారి యోగక్షేమమే ఆయన వహిస్తారు. ఇదే శ్రీకృష్ణుడు, రమణ మహర్షీ చెప్పిన శరణాగతి. ఇది అంత సులభంగా, ఒక్క సారిగా కుదరదు. అనుకున్నవి నెరవేరినప్పుడు మన విశ్వాసం పొంగుతూ, లేనప్పుడు క్రుంగుతూ వుంటుంది. సద్గురువు సాంగత్యము, సేవవల్ల మాత్రమే స్థిరమైన శరణాగతి క్రమంగా కుదురుతుంది. ఈ లోగా అన్యచింతలు, శంకలు కల్గి, మనస్సు ఆయన స్థితి మరచి చంచలమవుతూ వుంటుంది. అతి పరిచయం వలన శ్రద్ధ మందగిస్తూ వుంటుంది. ఇలాంటి ఒడిదుడుకులు లేనప్పుడే మనకు అయన సన్నిధి లభించినట్లు. అప్పుడే మనకు ఆయన నుండి సంపూర్ణమైన రక్షణ లభిస్తుంది."

శ్రీ సాయిలీలామృతము, pg.247-248

http://www.saibharadwaja.org/books/saileelamruthamu/saileelamruthamu.aspx?page=152

జై సాయిమాస్టర్!
« Last Edit: March 05, 2012, 02:33:57 PM by saimaster_eb » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
Pages: « 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 »
  Print  
 
Jump to:  

Powered by MySQL Powered by PHP Powered by SMF 1.1.15 | SMF © 2011, Simple Machines

All information in these boards is copyrighted to Sri Ekkirala Dwarakanath Jnaneswar.
Valid XHTML 1.0! Valid CSS! Based onDilber MC Theme by HarzeM And customized by Sai Master Forums Team