saimasterforums
 
*
Welcome, Guest. Please login or register. May 21, 2012, 03:13:57 AM


Login with username, password and session length


Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 »
  Print  
Author Topic: Daily Inspirational quotes of Master Garu!!!  (Read 4737 times)
Krishna@Jai sai master and 1 Guest are viewing this topic.
saimaster_eb
Hero Member
*****
Posts: 2319


I Love my Master


« on: April 14, 2011, 07:38:20 AM »

Jai Sai Master!

My Dear Gurubandhus,

With Master gari prerana and blessings, and Dwarakagari permission today onwards(guruvaramu), I am starting this new thread "Daily Quotes of Master Garu" .... and thinking to post a daily quote from all his litarature....

I am really grateful to the almighty and ALL who gave this opportunity to do his SEVA.

I request all forum members to share their views and ideas freely...

Any suggestions regarding the name of the thread?? please let me know ASAP.

Jai Sai Master!
« Last Edit: April 16, 2011, 01:34:32 PM by saimaster_eb » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saiuttampallavi
Global Moderator
Hero Member
*****
Posts: 641



« Reply #1 on: April 14, 2011, 10:19:47 AM »

Jai Sai Master.
Lalitha garu,

Nice idea. How are you planning? Is it random quotes from any Book?

Jai Sai Master.
Logged

Sadguru Seva is the most precious Gift God gave to Mankind.
saimaster_eb
Hero Member
*****
Posts: 2319


I Love my Master


« Reply #2 on: April 14, 2011, 10:48:24 AM »

Jai Sai Master!

Avunandi uttampallavigaru, anni books nunchi random quotes pick cheddamani..,

I am planning to pick ramdom quotes from different(all) books of master...So that along with our nityaparayana and combined reading, we can allot some more time for those quotes, and we will get(hopefully) something out of it. That's the main intention.


Jai Sai Master!

PS...Dear admin is it possible to remove those posts from my account. I am feeling little heavy with them. Can you make me newbie?.
« Last Edit: April 16, 2011, 01:37:47 PM by saimaster_eb » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319


I Love my Master


« Reply #3 on: April 14, 2011, 12:24:15 PM »

Jai Sai Master!

Sri sacchidananda sadguru sainadha maharaj ki Jai!
Sri sacchidananda sadguru alivelumangamma sahita baradwaja maharaj ki Jai!

'నేను' అంటే ఏది?
దేహమా? అయితే బాల్యంలోనిదా, యవ్వనంలోనిదా? లేక వార్ధక్యం లోనిదా? ఏది నేను?  

ఈ దేహం పదార్ధం చేత చేయబడినది. ఇందులోని పదార్ధమంతా అన్న పానీయాల రూపంలో బయట ప్రకృతి నుండి వచ్చి శరీరం రూపంలో చేరినదే. శరీరంలోని పదార్ధం నిజానికి బయటిదే.
అలరూపంలోని నీరు నిజంగా అల ఉత్పన్నం కాక మునుపు అంతటా వున్నదే గదా! ఒకానొక శక్తి ప్రభావంచేత అంతటా వున్న నీటిలో కొంత భాగం లేచి తరంగం అవుతుంది. అలాగే ఇదీను.

మన అనుభవంలో 'నేను' అనేది అంతటా వున్నది గాదు. అంతటా వున్నదాని కన్యంగా, వేరుగా అనుభవమవుతూ మన వ్యక్తిత్వానికాధారమైనది. ఇది శరీరం - అంటే పధార్ధం కాదు.
నేననేది ఏది అన్నప్పుడు తక్కిన సృష్టికన్యంగా వున్నట్లనుభవమవుతున్నదేదీ? అన్నది ప్రశ్న?

గుండె కొట్టుకోటం, శ్వాస ఆడడానికాధారమైన ప్రాణశక్తే మనమా? అయితే అన్నింటిలో, అందరిలో పని చేస్తూంది. అదే నేననేదైతే మనం సృష్టినుంచి వేరెలా అవుతాము?
ఆ శక్తే మనమన్న మాటకర్ధం - సృష్టి కన్యంగా మనం లేమని.

అన్యం అన్న భావమే నేను. భావం యదార్ధమెలా అవుతుంది? మంచి వాణ్ణి చెడ్డ వాడని మనం పొరపాటున భావిస్తే మన భావం వాడి నైజమెలా అవుతుంది?
సృష్టి కన్యంగా నేనున్నాను ' అన్నది కేవలం భావమే కాని యదార్ధం కాదు. అందుకే అజ్ఞానమన్నారు దానిని. 'మాయ' అని కూడా అంటూ ఆ పదానికర్ధం ' యా మా సా మా యా ' అంటే ఏది వాస్తవంగా లేదో(కాని ఉన్నట్లు స్పురిస్తుందో  - ఆకాశంలో నీలి వర్ణంగా , సంధ్యా కాలంలో ఎరుపులా, రాత్రి యందు నలుపులా) అదే 'మాయ ' అని అర్ధం చెప్పారు.  
 
'మనమీ దేహమన్నది అనుభవం కదా అబద్ధమెలా అవుతుంది?' అంటారేమో. స్వప్నంలో స్వప్న దేహం ధరించి, స్వప్న జగత్తు కన్యంగా, స్వప్నంలో మనముంటూ సన్నివేశాలననుభవిస్తాము.
అనుభవం అలా వున్నంత మాత్రాన ఆ పరిమిత స్వప్నదేహమే మనమా లేక ఒక 'మన' చైతన్యం 'మన' స్వప్నదేహం రూపంలోనూ, తక్కిన స్వప్నజగత్తులోని వస్తు వ్యక్తుల రూపంలోనూ ఉందా?  
మనం పరిమితి గల్గి, సృష్టికన్యంగా వున్నట్లు అనుభవం అవుతొందా? అనుభవం నిజానికి కొలబద్ద అయితే మెలకువలోది అనుభవమా, స్వప్నంలోదా? నిద్రలోదా?


source... Dyanayoga sarwaswam, page 61 (naenu).

on this auspicious day my humble pranams to maharshi.


Jai Sai Master!
« Last Edit: April 16, 2011, 01:36:40 PM by saimaster_eb » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
asterias
Global Moderator
Hero Member
*****
Posts: 923


« Reply #4 on: April 15, 2011, 05:56:52 AM »

Jai Sai Master !

Dear Lalithagaru!

Thanks for once again starting the thread. The thread is a very good reminder for us to read all of Mastergaru's books. Especially some of the important quotes that you put make one want to the read the whole book !

Please carry on!

Jai Sai Master !
Logged
saimaster_eb
Hero Member
*****
Posts: 2319


I Love my Master


« Reply #5 on: April 15, 2011, 07:41:08 AM »

Jai Sai Master!


"అందరూ తరుగులేని సంతోషంకోసం ప్రాకులాడేవారే.
తరుగులేని సంతోషాన్ని ఆనందమంటారు. ప్రతిజీవీ ఇటువంటి ఆనందం కోసం ఇంకా ఇంకా అన్వేషించడాన్నిబట్టి చూస్తే ఇటువంటిది వారికింకా లభించలేదని ఋజువౌతున్నది. కారణం ఇంద్రియాలద్వారా  జీవులుపొందే సంతోషం పరిమితమూ తాత్కాలికమూ ఐనది. అంతే కాక ఏ ఇంద్రియంద్వారా ఐనా జీవులుపొందే సంతోషం పరిమితమూ తాత్కాలికమూ ఐనది, అంతే కాక ఏ ఇంద్రియముద్వారా ఐనా తృప్తిని అతిగా అన్వేషిస్తే ఆ ఇంద్రియమో లేక ఆరోగ్యమో దెబ్బతినడం మనకు కనిపిస్తూనే ఉంటుంది. అంతేకాదు ఒకపరిమితి దాటాక ఆ ఇంద్రియానికీ సంతోషం కలిగించే వస్తువే దానిపట్ల విముఖతను కలిగిస్తుంది. తీయటి పదార్ధం తిన్నాక ఒక స్థితిలో మొఖం మొత్తుతింది. మానవుడు తనకు తెలిసినా తెలియకపోయినా అన్వేషించేది ఇటువంటి దొషమేలేని ఆనందాన్ని. ఆధ్యాత్మికత అంతా అటువంటి ఆనందాన్ని పొందేందుకు మార్గమే. పరమత దూషణ వంటివి ఈ అన్వేషణని మధ్యలో ప్రక్కదారి పట్టిస్తాయి గనుక దోషాలౌతున్నయి. ఆధ్యాత్మికత ద్వారా నాస్తికుడైనా అటువంటి ఆనందాన్నిపొందవచ్చు. కారణం ఆ అనంద స్థితే "దైవం" అనీ ఆస్తుకుడంటాడు; ఆ పేరును మాత్రమే వ్యతిరేకిస్తాడు నాస్తికుడు.
"ఆనందోబ్రహ్మ"(ఆనందమె బ్రహ్మ) అని ఉపనిషత్తులు చెబుతాయి. "దైవం అంటే ఒకస్థితి" అని జ్ఞానులు చెబుతున్నారు. "ఏది ఉనదో అదే ఆత్మ లేక దైవం" అని రమణ మహర్షి,ఆనందమయి అమ్మ వంటి జ్ఞానులు చెబుతున్నరు. దానినే "ఏదినిజం" లో నిజం అన్నాము."

(cont...)

 
source.....Mastergari Matam Enduku, page 23,24(ఆనందం)

Jai Sai Master!
« Last Edit: April 16, 2011, 01:35:48 PM by saimaster_eb » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319


I Love my Master


« Reply #6 on: April 16, 2011, 09:17:19 AM »

Jai Sai Master!

(cont.....)


మనకు దేన్నించి ఆనందం వస్తుందో దానిమీదే ప్రేమ ఉంటుంది.
మనం కొన్ని వస్తువులను ఇష్టపడడం వాటినుంచి సంతోషం వస్తుందని అనుకోబట్టే, కాని ఎవరికైనా అన్నింటికంటే ప్రీతికరమైన వస్తువు తానే. దానిని ఆధారం చేసుకొనే తనకు ప్రీతికరం కాబట్టే ఏ వస్తువుమీదనైనా ఇష్టమేర్పడేది. చివరికి స్వార్ధరహితమైన కర్మలన్నీ కూడా తనకు తృప్తిని కలిగిస్తాయి. కనుకనే సంతోషదాయకాలౌతాయి కొందరికి. అందుకే జిళ్ళెళ్ళమూడి అమ్మ అంటారు, " ధనమూలం మిదం జగత్ " అంటారుగానీ " తనమూలం మిదం జగత్ " అంటే బాగుంటందని. దేశాభిమానం, భాషాభిమానం, దేహాభిమానం వంటివి తనమీద తనకుండే ప్రేమనాధారం చేసుకొనే వుంటాయి. ఆనందాన్ని కలిగించని విషయం మీద మానవుడికి ప్రేమ లేకపోవడం, తనకి తాను అన్నింటికంటే ప్రియం అవటాన్ని బట్టి చూస్తే ఆనందం తనలోనే,  తానుగానే ఉందని చెప్పవలసి వస్తుంది.
ఈ అనందమే గాఢ నిద్రలో అనుభవమయ్యేది కూడా. 


source....."Matam Enduku" page 24,25.

Jai Sai Master!
« Last Edit: April 16, 2011, 01:35:14 PM by saimaster_eb » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319


I Love my Master


« Reply #7 on: April 17, 2011, 02:57:35 PM »

Jai Sai Master!

మీ నిత్య జీవితంలొ నేను చేసిన అధ్యాత్మిక విషయాలను అమలు పరచుకోవడం గురించి నేనిపుడు చెబుతున్న విషయాలను ఙ్నాపకం పెట్టుకోండి.

మీలో కొందరికి నిజమైన పవిత్రతను ఆచరించేదానికి బదులుగా తమ పవిత్రతను ప్రదర్షించుకోవడంలో గర్వపడే వారున్నారు. దానివలన వాళ్ళకు లభించే పేరు ప్రఖ్యాతిల పట్ల మాత్రమే వారి హృదయంలోనిజమైన కోరిక వుండి, అలా కీర్తికోసం, ప్రఖ్యాతి కోసం ప్రాకులాడుతారు. అందుకు గర్వ పడడం నిరర్ధకమే కాకుండా తీవ్రమైన ప్రమాదకరమైనదనే సంగతి పట్టించు కోకుండా స్వార్ధపూరితమైన మనస్సుతోఇంకా ఇంకా అందుకే అంకితమవుతారు.పైకి మాత్రమే ఆధ్యాత్మికతకు అంకితమైనట్లు కనపడినా హృదయంలోమాత్రం కీర్తి ప్రఖ్యాతిలను అంటి  పెట్టుకు వుండడం  పంచ బక్ష్య పరమాణ్ణాన్ని విషంలో ముంచుకు తినడం వంటిది. ఇదంతా వంచన. కపట వేషం, లౌకికమైన కీర్తి అనే విషాన్ని త్రాగవద్దు.పవిత్రమైన కార్యాలు చేస్తారని నలుగురూ కీర్తించడం కోసం, పవిత్రమైన కార్యాలు చేయడం కోసం విషాన్ని త్రాగడం మానండి. దానిని త్యజించండి. హృదయ పూర్వకమైన సాధనను మాత్రమే కొనసాగించుకోండి.

source.....TibetYogi Milarepa Charitra, pg 162(ముఖ్యమైనది).



Jai Sai Master!
Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319


I Love my Master


« Reply #8 on: April 18, 2011, 07:02:06 AM »

Jai Sai Master!

ప్రజలు బాబా ఆశీస్సులకోసమూ, ఆయన కృపాదృస్టివల్ల తమ కోరికలు తీరుతాయనే ఆశతోనూ ఆయన చుట్టూ మూగేవారు. ఏ మాత్రం శ్రమ పడకుండా, కాని ఖర్చులేకుండా కోరికలు తీరే మార్గం దొరికితే ఆకోరికలు తీర్చడంలోని వారి దివ్యత్వాన్ని మరుస్తారు. వ్యక్తిగత  కృషి త్యాగ భావనలతో తమ స్థితిని అభివృద్ధి పరచుకోవడానికి బదులు విలువగల విలువలేని విషయాలను తీర్చుకోవడానికి మనిషి దిగజారి యింకా యింకా దుఃఖాన్ని కొనితెచ్చుకుంటాడు.

అటువంటి మనస్తత్వంతో ప్రజలు వారిచుట్టూ చేరుతున్నపుడు మహాత్ములు వారి అద్బుతశక్తులను  సత్యంకోసం అన్వేషించే సాధకులకు నిదర్శనాలివ్వటం వరకు మాత్రమే పరిమితం చేసుకుంటారు. కాలక్షేపంకోసం వారి దివ్యశక్తులను పరీక్షింప యత్నిచే వారిని మహాత్ములు లక్ష్యపెట్టరు. నిజమైన మహాత్ముడెపుడూ భక్తుల వ్యక్తిగత, మానసిక దృక్పధాలపట్ల ఖచ్చితమైన అవగాహన కల్గివుంటారు.

కొంతకాలానికి అర్ధరహితమైన కోరికలతో మహిమలకోసం వేధించే ప్రజల పట్ల తాజుద్ధీన్ బాబా విసుగుచెందారు. ఒకరోజాయన, "నేను రేపు పిచ్చాసుపత్రికి వెళ్తాను" అన్నారు. చెప్పినట్లుగానే ఆయన మరురోజు పిచ్చాసుపత్రికి వెళ్ళారు..............
 


source....Sree Hajarat Tajuddhin Baba, pg19,20.

Jai Sai Master!
« Last Edit: April 18, 2011, 07:04:09 AM by saimaster_eb » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319


I Love my Master


« Reply #9 on: April 19, 2011, 12:07:54 PM »

Jai Sai Master!


మహాత్ములను సేవించడమెలాగో తెలుసుకోకుంటే మనం రెండు విధాలా పొరపడతాము:

1)మన మెల్ల కాలము మహాత్ముల దయ వలన మనకోర్కెలన్నీ తీర్చుకుంటూ వుండవచ్చని, కష్టాలన్నీ తొలగించుకోవచ్చనీ, అంతకు మించి వారినుండి జ్ఞానంసంపాదించి దాని నాచరించనక్కరలేదనీ భ్రమిస్తాము. మనం చేసే పుణ్యపాపాలవలన మరు జనంలో కష్టసుఖాలొస్తాయి. మనలోని రాగద్వేషాలవలన పుణ్యాలు,పాపాలు చేస్తాము. అందరిలోనూ భగవంతుడున్నాడని గుర్తించలేనందువలన కొన్నింటిపై ద్వేషము, కొన్నింటిపై రాగము  వహిస్తాము. అంటే అజ్ఞానం వలన రాగద్వేషాలు, వాటివలన పుణ్యపాపాలు, వాటివలన జన్మపరంపర, ప్రతి జన్మలోనూ సుఖదుఃఖాలూ కల్గుతాయి. అజ్ఞానం వలన సుఖము  కలిగినప్పుడు గర్వించి మరిన్ని పాపాలు  చేస్తాము. కనుక క్రమంగా పుణ్యం నశిస్తూ పాపం పెరుగుతూ వుంటుంది. కొందరు భ్రమించినట్లు మన పుణ్యాలు మన పాపాలను నశింపచేయలేవు. వేటికవే అనివార్యంగా అనుభవమౌతాయి. మనం మహాత్ములనాశ్రయిస్తే వారు మరొక జన్మలో మనమనుభవించవలసిన పుణ్యఫలాన్ని కొంత ఈ జన్మకూ, ప్రస్తుత దుఃఖాన్ని కొంత మరొక జన్మకూ తరలించి మనకు ఉపశాంతి చేస్తారు గానీ శాశ్వతంగా దుఃఖము లేకుండా వుండాలంటే మనం పుణ్యపాపాలు చేయడానికి కారణమైన అజ్ఞానాన్ని నశింపచేసుకోవాలి.

పైన తెల్పిన రీతిన తాత్కాలికంగానైనా  మన దుఃఖాలు తొలగించి సుఖాలను ప్రసాదించినందుకు  కృతజ్ఞతతో మనం వారిని మరింత శ్రద్ధాభక్తులతో సేవించి వారు బోధించినది ఆచరించగలగాలనే మహాత్ములు అలా చేస్తారు. అలా చేసే భక్తులు, బాద్యత ఎరిగిన బిడ్డలు తండ్రికి సంతోషం కల్గించినట్లు సద్గురువుకు ప్రీతిపాత్రులౌతారు. లేనివారు బాధ్యత తెలియని పిల్లలలాగా వారి ప్రీతికి పాత్రులుకాలేరు.

అందుకే, " నేను ఒకటి రెండుసార్లు హెచ్చరిస్తాను.వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను" అన్నారు శిరిడి సాయిబాబా.

అవధూత వెంకయ్యస్వామిగూడా "పోయేవారిని పోనిచ్చేదే గదయ్యా!" అన్నారు.

"ఎద్దల్లే తిని మొద్దల్లే పడుకుంటే దేవుడు కనిపించడు" అన్నారు అవధూత పిచ్చమ్మగారు.




source....Achaarya Sree Ekkirala Bharadwaja vaari Avadhuta venkayya Swami, pg 11,12.

Jai Sai Master!
« Last Edit: April 19, 2011, 12:57:53 PM by saimaster_eb » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319


I Love my Master


« Reply #10 on: April 20, 2011, 08:56:54 AM »

Jai Sai Master!

గురువును సేవించవలసిన పద్ధతి తెలుసుకొనకుంటే మనమింకొక లాగా గూడా పొరపడతాము.

భగవంతుడు నామరూపాలే లేక ఎప్పుడు సర్వత్రా వున్నాడు. నామరూపాలను మాత్రమే గుర్తించగల మనకు ఆ భగవంతుడు నామరూపాలతో సద్గురువుగా దర్శనమిస్తాడు. దానినే గురుతత్త్వమంటారు.  ఆగురుతత్వమే శ్రీ దత్తాత్రేయుడు. ఆయన అవతారలయిన శ్రీ పాదవల్లభుడు, శ్రీ నృసిం హసరస్వతి, శ్రీ మాణిక్యప్రభువు, శ్రీ అక్కల్కోటస్వామి, శ్రీ శిరిడిసాయిబాబా. ఎప్పుడూ భూమిమీద మానవులకు లభించే సద్గురువులందరూ శ్రీ దత్తాత్రేయుని రూపాలే. ఇలా భక్తులకు నామరూపాలతో ప్రకటమైనా నిజానికి తాము వాటికి పరిమితులుగారనీ అంతటా నిండియున్న దైవమే  తామనీ వారు తమ లీలలద్వారా తెలుపుతారు. ఇది గుర్తించకుంటే మన వలెనే ఆ గురువు కూడా వారి నామరూపాలు మాత్రమేనని భ్రమించి యితర మహనీయుల పట్ల సంకుచితమైన అసహనాన్ని వహిస్తాము. అంటే మాహాత్ములందరి రూపంలోనూ ప్రకటమయ్యే దైవాన్నే నిరాకరిస్తాము. అపుడు మన సద్గురువు యొక్క నిజతత్త్వాన్ని గూడా నిరాకరిస్తాము.

ఈ పొరపాటు జరగకుండా వుండాలంటే కొంతమంది సద్గురువుల చరిత్రలు, బోధలు చదవాలి అనేకమంది సద్గురువులను దర్శించాలి. దైవమనే బంగారమెలా వుంటుందో తెలియనిదే మన సద్గురువనే బంగారువుంగరం యొక్క విలువను గుర్తించలేము. తేనెయొక్క విలువను తెలిసి గుర్తించగల తేనెతీగ మాత్రమే తేనెగల పువ్వులన్నింటినీ గుర్తించి ఆశ్రయించగలదు. ఆ పువ్వుయొక్క నామరూపాలను పట్టించుకొనకుండా దానిలోదాగియున్న తేనెను గుర్తించగలదు. అలాగే మన మాశ్రయించిన సద్గురువుయొక్క భౌతికమైన రూపం, లౌకికమైన నామముల మాటున దాగియున్న దైవత్త్వాన్ని గుర్తించగలగాలంటే, సద్గురువులందరి రూపంలోనూ ఒకే దైవమెలా  ప్రకటమయ్యాడో వారి చరిత్రలనుండి గమనించాలి. వారు మనకు తెలిపిన సేవా విధానం తెలుసుకొని మనమనుసరించాలి.

భాగవతం ఏకాదశ స్కంధంలో అవధూత గూడా తాను 24 మంది గురువులనుండి జ్ఞానమార్జించానని చెప్పారు. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు గూడా తత్త్వదర్శనులైన గురువులను శరణుపొంది, సేవించి చక్కగా ప్రశ్నించమని, అలా చేస్తే అట్టి గురువులు  జ్ఞానం ఉపదేశిస్తారని అర్జునుడితో బహువచనంగానే చెప్పారు. ఇందులో యింకొక్క సూత్రం యిమిడి యున్నది. ఎందరు గురువులను మహనీయులనూ దర్శించినా వారి దర్శన ఆశీస్సులన్నీ మొదట మనమాశ్రయించిన సద్గురువుయొక్క కృపవల్లనే  లభిస్తాయి......................
ఉత్తమురాలయిన ఇల్లాలిని ఎందరు గౌరవించి ఆదరించినా, అందుకు కారణం ఆమె పాతివ్రత్యమే గదా! ఈ సూక్ష్మం తెలియకుంటే, గుర్తించుకోకుంటే, అనేకమంది మహనీయులను దర్షించినా గూడా చిత్త చాంచల్యమే కలుగుతూంది.

             

source.....Acharya Sree Ekkirala Bharadwaja gari Avadhuta Venkayya Swami, pg (13,14,15)

Jai Sai Master!
« Last Edit: April 20, 2011, 08:58:42 AM by saimaster_eb » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319


I Love my Master


« Reply #11 on: April 21, 2011, 10:04:00 AM »

Jai Sai Master!

ఆత్మజ్ఞానులైన సద్గురువులు అందరినీ తమ రూపాలుగానే చూసుకుంటారు. కనుక తాము గురువులమనీ, మనము శిష్యులమనీ భావించరు. అందువలన మనం వారినెలా సేవించవలసినదీ వారుగా మనకెన్నడూ చెప్పరు.ఎప్పుడైనా వారికి అర్హులైన భక్తులు దొరికితే వారితో మాత్రమే తాము తమ గురువును ఎలా సేవించినదీ చెబుతారు. అదే మనకు మార్గదర్శకం. అదే వారి కృపను పొందడానికి ఏకైక మార్గం. మహత్ములందరి చరిత్రలూ చదవడం సాధ్యం కాదు. గనుక కనీసం శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయిబాబా జీవితచరిత్ర శ్రీ సాయిప్రబోధామృతము ఆయినా చూస్తే సద్గురు సేవా విధానం తెలుస్తుంది. వంట, పూజ ఎలా చేయాలో తెలియకుంటే సద్గురువునకు నైవేద్యము, సేవ అర్పించడం తెలియనట్లే. సద్గురు సేవా విధానం తెలియక మన భక్తి సఫలం కాదు. రాజుకు కొడుకై జన్మించినా బాధ్యత ఎరుగని రాజకుమారుడు ఆయన నుండి రాజ్యం పొందలేక అందరు తండ్రుల బిడ్డలవలెనే మహరాజు నుండి తిండి, గుడ్డవంటి అత్యల్పమైన లాభం మాత్రమే పొందగలుగుతాడు. రాజ్యార్హతగల అంటే బాధ్యత ఎరిగిన మరొక రాజకుమారుడు రాజ్యాన్ని పొందినట్లే, గురువును సేవించే విధానం తెలిసినవారు మాత్రమే ఆయన నుండి ఉత్తమ ఫలితం పొందుతారు. 

Jai Sai Master!
« Last Edit: April 21, 2011, 10:06:20 AM by saimaster_eb » Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319


I Love my Master


« Reply #12 on: April 22, 2011, 12:16:33 PM »

Jai Sai Master!

భక్తులను వ్యక్తిస్థాయిలో, దేశప్రజలను  దేశస్థాయిలో సాయి ఎలా కనిపెట్టి తమ కర్తవ్యం నిర్వహించినా యీ  రెండు అంశాలూ  కేవలం తాత్కాలికమూ, బాహ్యమూ, అశాశ్వతమూ అయినవి మాత్రమే. వీటన్నింటికీ మూలము ఆధ్యాత్మిక స్థాయిలో జరగవలసిన మానవజాతి పరివర్తనమే. మానవులందరి చర్యలు, మాటలు, వారి అలోచనలపై ఆధారపడటాయి. వారి యోచనలు, వారిలోని యిష్టాయిష్టాలు, వారివారి అహంకారమమకారాలపై అధారపడటాయి. అవి అనేక జన్మలు పట్టువిడవక వారిని వెంటాడే సంస్కారాలమీద ఆధారపడతాయి. వజ్రము, పాషాణాలకంటె దృఢమైన యీ సంస్కారాలలో మార్పు వస్తేగాని పై అంశాలలో(వ్యక్తిస్థాయిలో,దేశస్థాయిలో)  మానవజాతిలో ఎట్టి వికాసమూ కలుగదు. వారి వేషబాషలలోను, వారి వ్యవస్థలలోనూ బాహ్యమైన నామరూపాలలో ఎన్ని మార్పులు, క్రొత్త పొకడలైనా కంపించవచ్చుగాని, వాటి మాటున దాగియుండే మానవనైజంలో ఎట్టిమార్పూ కల్గదు. ఇట్టి పూర్వజన్మ కుసంస్కారాలను కరిగించి, అంతకంటే మేలైనరీతిన మూసపోయాలంటే మానవ హృదయపులోతులలో, అధ్యాత్మస్థాయిలో మహత్తరమైన పరిమాణం  జరగవలసి వుంటుంది. ఇందుకు మహోన్నత దశలో వున్న మహాత్ములెందరో అవతరించవలసి వుంటుంది. వారి సాంగత్యంవలన ఎక్కువమంది ప్రజల హృదయాలలో తరతరాలుగా ఉత్తమమైన మార్పులు కొనసాగాలి. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శంకుస్థాపనయే సాయి అవతరణ.   

విశ్వగురుడైన దత్తాత్రేయ స్వామి ఒకే కాలంలో, శ్రీ అక్కల్ కోట స్వామి, శిరిడి సాయినాధుడు, శ్రీ గజానన్ మహరాజ్, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి, శ్రీధునీవాలాదాదాగార్ల రూపాలలో ప్రకటమవ్వడంలోని అంతర్ధానమిదే. ఈ అవరాతారన్నీ వారి రూపాలున్నంతకాలం  మాత్రమే ప్రభావం కలిగియుండి, అటుపైన అంతరించకుండా, ఎల్లకాలమూ ప్రభావం కలిగి యుండే లాంటివి. అంతేకాదు వారి చరిత్రలపారాయణవలన అంతటి మహత్తరమైన వారి ప్రభావాన్ని మన మెక్కువగా పొదేలాగున మనను మనం సంస్కరించుకోడానికి ఉపకరించేవి. వీటికి తోడు శుద్ధము, శాశ్వతమూ అయిన దత్తాత్రేయ తత్త్వం నుండి మనకు అనుగ్రహం లభింపజేయగల "శ్రీగురుచరిత్ర" వుండనే వున్నది. ఈ అనుగ్రహాన్ని మన దేశకాలపరిస్థితులకు అనుగుణమైన రీతిన మలచి మనకు అందిస్తాయి - శ్రీ సాయిబాబా శ్రీ అక్కల్ కోట స్వామి మొదలైన వారి చరిత్రలు. ప్రజలలో ఎక్కువమంది ఈ ఉత్తమ సాధనాన్ని విడువకుండా వినియోగించుకొంటే మరెన్నో రీతుల దత్తస్వామి అవతరించగలరని చెప్పవచ్చు.



source....Acharya Ekkirala Bharadwaja gari "Sai Sannidhi" (pg 3,4)
 
Jai Sai Master!!
 



   
Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319


I Love my Master


« Reply #13 on: April 23, 2011, 04:35:49 PM »

Jai Sai Master!!!

"స్నేహితులారా వినండి. బాల్యంలోనే సద్గురువును వెదుక్కోవాలి. వారి కృపకు పాత్రుడుకావాలి. ఈ విధముగా వారి కృపకు పాత్రుడై బ్రహ్మజ్ఞానాన్ని పొందుటమే మానవుని ముఖ్యకర్తవ్యము. దానిని ఈ బాల్యంలోనే సాధించుకోవాలి. ఎందుకంటే ఈ బాల్యావస్థ దాటి యౌవనావస్థ వచ్చిందంటే మనస్సు విషయాలయందు వ్యామోహపడి, ఆ విషయాలలోనే చిక్కుకుపోతుంది. ఇక దానికి మోక్షాపేక్షయే కలుగదు. ఇక ముసలితనంలో తాను అనుభవించిన సంస్కారాల వాసనలు విడువక అలలవలే మరల మరల లేస్తూ మనస్సును ధ్వంసం చేస్తాయి. దానితో సవతి పోరు పడలేక మగని యింటినుంచి పుట్టింటికి వెళ్ళిపోయిన భార్యలాగా జ్ఞాపక శక్తి కూడా నిలువలేక బయటికి పోతుంది. అంతటి హీనమైన బుద్ధితో సద్గతి పొందుట ఎట్లు? ఈ హీనమైన జడదేహము గాలిలోని దీపంలా, నీటి మీద బుడగలా అనిత్యం. అందువలన చిన్న వయస్సులోనే మనస్సును విషయాలలో చిక్కుపడనివ్వక బ్రహ్మమునందు లయించునట్లు చేయగల సద్గురువును వెదకుటకై నేనిలా బయలుదేరాను."


source........Acharya Ekkirala Bharadwaja gari "Siddharudha Swami Charitra" (pg 12)

Jai Sai Master!
Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
saimaster_eb
Hero Member
*****
Posts: 2319


I Love my Master


« Reply #14 on: April 24, 2011, 02:27:46 PM »

Jai Sai Master!


సాయిని పూజించినంతనే మోక్షప్రాప్తి కల్గుతుందా? వారి సూక్తులను నిత్యజీవితంలో ఆచరణ చేస్తేనేనా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీ మాష్టర్ ఇలాచెప్పారు.

పూజకు అర్ధం తెలియకుండా చేస్తూ, ఆయన ఏమిటో తెలియకుండా పోలేరమ్మను పూజించినట్లు పూజిస్తేనే యీ ప్రశ్న ఉద్భవిస్తుంది. శ్రీసాయీశుని చరిత్రపారాయణవలన ఆయనపై ఎలాంటి వారికైనా ప్రేమ కల్గుతుంది. ఆ ప్రేమను వ్యక్తం చేసుకొనే పద్ధతులలో ఒకటి పూజ. రెండవది వారి సూక్తుల ఆచరణ. ప్రేయసికి ప్రియుని మాటలె ధృవతారలైనట్లు.

అయితే ఇది చరిత్ర పారాయణ ద్వారా ఎవరికివారికే కల్గాలిగాని, మరొకరు చెప్పేది, చర్చించేది గాదు. వారిపట్ల ప్రేమ మనకెంతగల్గిందో, విశ్వాసమెంత వున్నదో, సూక్తులు ఎంతవరకు ఆచరిస్తున్నామో ఎవరి అంతరాత్మ సాక్షి వారిది. ఎవరి బాహ్యాంతర పరిస్థితులను, పరిపాకాన్ని యింకొకరెవరో అర్ధం చెసుకోజాలరు. సాయివంటి సకలభూతహృదయస్థులు తప్ప. అందుకే బైబిలులో క్రీస్తు ఒక వ్యభిచారిణిని ఆదుకొన్నారు. నిష్కామంగా మాత్రమే సాయిని దర్శించాలని సాటివారికి చెబుతున్న భక్తుని నిగ్రహించారు. 

ఇది మరచే ఒకరు మరొకర్ని ఎంచడం మొదలుపెట్టడం కూడా సాయి, క్రీస్తూ అంగీకరించలేదు. కారణం పరిపాకాలలో తారతమ్యాలుంటాయి. ఎవరినీ వారి పరిపాకాన్ని మించి నడవమనకూడదు. అది పక్వానికి రాని కాయ కోసినట్లు. దానికి తోడు ఎక్కువమంది అటు తమ పరిపాకానికిమించి ఆవేశంతో నడచుకోవాలని ఒకనాటికి అహంకరించి ఒక్కొక్కరొక్కక్క గురువుగా వెలసి లోకానికి అహితం చేయడమో లేక సాయిపధం నుండి ప్రక్కదారి పట్టడమో జరుగుచున్నది. సాయి యందు ఎంత ప్రేమ కల్గితే అంతగా ఆయన చరిత్ర, బోధలు నిత్యనూత్నమై పారాయణయందు రుచి పెరుగుతుంది. లేకుంటే అవి యాంత్రికమై "ఊరికే పారాయణవల్ల లాభమేమిటి"  అనిపిస్తుంది. ప్రియురాలిపట్లరాని "పాతరోత"  అన్నభావం ఆయనపట్ల ఎలా వస్తుంది?
ఒకరికొకరం విషయం వివరించుకోవచ్చు, ప్రొత్సహించుకోవచ్చు, ప్రేమతో సూచనలు చేసుకోవచ్చు. ఆ పైన ఎవరి యత్నానికి వారిని విడవాలి. వారికై మనం సాయిని  ప్రార్ధించడం తప్పులేదు. ఆయనున్నాడు వారిని సరిగా మలచుకోడానికి. అదే ఆయనిచ్చిన హామీ


source.....Sri Acharya Ekkirala Bharadwaja gari  "పరిప్రశ్న?" (pg25,26)


Jai Sai Master!
Logged

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra
Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 »
  Print  
 
Jump to:  

Powered by MySQL Powered by PHP Powered by SMF 1.1.15 | SMF © 2011, Simple Machines

All information in these boards is copyrighted to Sri Ekkirala Dwarakanath Jnaneswar.
Valid XHTML 1.0! Valid CSS! Based onDilber MC Theme by HarzeM And customized by Sai Master Forums Team