suma
Newbie

Posts: 47
|
 |
« Reply #15 on: July 23, 2009, 05:30:34 PM » |
|
శ్లోకం: చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాద బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః
భావం: అజ్ఞానాంధకార రహితమును, శాంతమును ,శాశ్వతమును, ఆకాశమును కూడా గమనింపగలదియు,తత్కారణముగ ఆకాశము కంటే సూక్ష్మమును అయిన చైతన్య స్వరూపుడును, నాద బిందు కళలకు అతీతుడును అయిన శ్రీ గురువునకు నమస్కారము.
|
|
|
|
« Last Edit: July 23, 2009, 06:03:40 PM by suma »
|
Logged
|
|
|
|
suma
Newbie

Posts: 47
|
 |
« Reply #16 on: July 24, 2009, 05:13:41 PM » |
|
శ్లోకం : కాశీ క్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం గురుర్విశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మ నిశ్చయః
భావం:విశ్వమునకంతటికి ఈశ్వరుడైన వాడే మానవ రూపమున సద్గురువుగా అవతరించును. కనుక అతడెచటనుండిన అదియే కాశి. గంగ ఏ విష్ణు పాదములయందుదయించునో అట్టి సర్వవ్యాపియు సద్గురువు కనుక భక్తుని హృదయమున స్మరణ రూపమున ఆయనయే వుండును . అట్టి స్మరణ చేయు శిష్యుని గృహము కూడా కాశీతో సమానమైనది. అతడు గురుపాదోదకముగా భావించి సేవించెడి నీటియందు అట్టి శక్తి మేల్కోనును. అట్టి సద్గురువు సాక్షాత్తు విశ్వేశ్వరుడే. ఆయన వాక్కు తరింపజేయునట్టి బ్రహ్మ వాక్కు ! ఇది నిశ్చయము.
|
|
|
|
|
Logged
|
|
|
|
suma
Newbie

Posts: 47
|
 |
« Reply #17 on: July 24, 2009, 05:19:39 PM » |
|
శ్లోకం : యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్
యదానందేన నందంతి తస్మై శ్రీ గురవే నమః
భావం: దేని యొక్క వునికి చేత ఈ జగత్తునకునికి కలుగుచున్నదో (కుండ యొక్క వునికికి మట్టి యొక్క వునికి ఆధారమైనట్లు, భావన యొక్క వునికికి మనస్సాధారమైనట్లు)-- దేని యొక్క ప్రకాశము చేత జగత్తునందలి వస్తువులు వ్యక్తమగుట అనుగుణము కలిగియున్నవో, ఏ ఆనంద స్వరూపమగుట వలన జగత్తునందలి జీవులు ఆనందముననుభవించగలుగుచున్నవో అట్టి శ్రీ గురునకు నమస్కారము.
|
|
|
|
« Last Edit: July 24, 2009, 05:21:22 PM by suma »
|
Logged
|
|
|
|
suma
Newbie

Posts: 47
|
 |
« Reply #18 on: July 25, 2009, 06:31:23 PM » |
|
శ్లోకం : శరీరమింద్రియం ప్రాణమర్ధ స్వజన బాంధవాన్.
ఆత్మధారాధికం సర్వం సద్గురోభ్యో నివేదయేత్.
భావం: శరీరమును, ఇంద్రియములను, ప్రాణములను, ధనమును, భార్య పుత్రాది స్వజనులను సద్గురువునకు నివేదించవలయును.
|
|
|
|
|
Logged
|
|
|
|
suma
Newbie

Posts: 47
|
 |
« Reply #19 on: July 25, 2009, 06:34:14 PM » |
|
శ్లోకం : ఏక ఏవ పరో బంధుర్విషమే సముపస్థితే గురు స్సకల ధర్మాత్మ తస్మై శ్రీ గురవే నమః ||
భావం:విషమ పరిస్థితులు ప్రాప్తించినప్పుడు బంధువులందరి కంటే అధికుడయిన బంధువు సద్గురుడే. శిష్యుడాచరింపవలసిన ధర్మస్వరూపుడా గురువే కనుక అయననెల్లప్పుడు ధ్యానించుటయే ,శరణు ఫొందుటయే సకల ధర్మములను ఆచరించుట .గీతలో "సర్వధర్మాన్ పరిత్యజ్య " అన్న శ్లోకాన్నీ శ్లోకం వివరిస్తుంది.
|
|
|
|
« Last Edit: July 29, 2009, 07:18:43 PM by suma »
|
Logged
|
|
|
|
suma
Newbie

Posts: 47
|
 |
« Reply #20 on: July 27, 2009, 07:01:32 PM » |
|
శ్లోకం : ఏనేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాధికం తదా జాగ్రత్స్వప్నసుషుప్త్యాది తస్మై శ్రీ గురవే నమః
భగవాన్ భరద్వాజ మహరాజ్ వివరణ: ఏ గురువు మన హృదయములందు సాక్షిరూపుడై ఈ సర్వమును చూచుచున్నాడో, మరియు మనస్సు ,బుద్ధి, చిత్తము,మొదలయిన మానసిక శక్తులు ఏ సాక్షి చైతన్యము వలన పని చేయగలుగుచున్నవో, ఏ సాక్షి చైతన్యము జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థలను మూడు స్థితులను గుర్తించుచున్నదో అట్టి సాక్షియగు గురువునకు నమస్కారము.
|
|
|
|
« Last Edit: July 27, 2009, 07:06:06 PM by suma »
|
Logged
|
|
|
|
suma
Newbie

Posts: 47
|
 |
« Reply #21 on: July 27, 2009, 07:17:19 PM » |
|
శ్లోకం : మన్నాధ శ్రీ జగన్నాధో మద్గురు శ్రీ జగద్గురుః మమాత్మ సర్వ భూతాత్మ తస్మై శ్రీ గురవే నమః
భావం: విశ్వానికంతటికి ఎవరు ప్రభువో ఆయన నన్ను తరింపచేయుటకు నా ప్రభు రూపమున వెలసినాడు. సృష్టి యందలి అందరు గురువుల రూపమున ఏ జగద్గురువైన పరమాత్మ వెలసెనో ఆయనయే నన్ను తరింపచేయుటకు నా గురు రూపమున అవతరించినాడు.నా అత్మ రూపమున ఏ పరమాత్మ ఉన్నాడో ఆయనయే సర్వ భూతములకాత్మ యై యున్నాడు. అట్టి గురువునకు నమస్కారము.
|
|
|
|
|
Logged
|
|
|
|
suma
Newbie

Posts: 47
|
 |
« Reply #22 on: July 29, 2009, 07:10:58 PM » |
|
శ్లోకం : మధులుభ్దో యధాభృంగో పుష్పాత్పుషాంతరం వ్రజేత్ |
జ్ఞానలుబ్ధస్తధా శిష్యో గురోర్గుర్వంతరం వ్రజేత్ ||
భావం: మధువునందు ప్రీతి గల తేనెటీగ ఒక పుష్పమునుండి మరొక పుష్పమునకు ఎట్లు తిరుగునో జ్ఞానముకొరకు తపించు శిష్యుడు ఒక గురువు నుండి వేరొక గురువు వద్దకు తిరుగవలెను.
|
|
|
|
|
Logged
|
|
|
|
suma
Newbie

Posts: 47
|
 |
« Reply #23 on: July 29, 2009, 07:12:47 PM » |
|
శ్లోకం : యస్య జ్ఞానమిదం విశ్వం నదృశ్యం భిన్న భేదతః | సదైక రూప రూపయ తస్మై శ్రీ గురవే నమః ||
భావం: ఏ చైతన్యము చేత విశ్వమంతయు తెలియబడు చున్నదో అట్టి చైతన్య స్వరూపుడగు గురువునకు నమస్కారము. మరియు సత్యమైన ఏ ఏక చైతన్యమునందు 'చూచువాడూ,'చూడబడునదీ అను భేదములు (లేక ఈ ప్రపంచమందలి భేదములు) అసత్యములని తెలియబడుచున్నదో అట్టి చైతన్య స్వరూపుడగు గురువునకు నమస్కారము.
|
|
|
|
« Last Edit: July 29, 2009, 07:16:47 PM by suma »
|
Logged
|
|
|
|
suma
Newbie

Posts: 47
|
 |
« Reply #24 on: July 29, 2009, 07:35:24 PM » |
|
శ్లోకం : గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||
భగవాన్ భరద్వాజ మహరాజ్ వివరణ :
అంతటా ఉన్నది తానొక్కడే అను జ్ఞానము వలన గురువు బ్రహ్మ అగుచున్నాడు. మానవుల పరిమిత క్రియా సామర్ధ్యమునకు రెండు చేతులు సంకేతము. భగవంతుని సర్వ సమర్ధతకు అంటే అలౌకికమగు లీలలను ప్రదర్శించగల సామర్ధ్యమునకు విష్ణువు యొక్క నాలుగు బాహువులు చిహ్నములు. నాలుగు బాహువులలో నాలుగు పురుషార్ధములను మానవులకిచ్చి జగత్తును పాలించుటకు విష్ణువే సమర్ధుడు .అట్టి శక్తులు అనంతముగ కలుగుట వలన సద్గురువు విష్ణువు అగుచున్నాడు.మరియు విష్ణువు వలె గురువు సర్వ వ్యాపి. సర్వభూత హృదయములయందుండి వాటిని నడిపించు ప్రభువే ఈశ్వరుడు .సర్వ భూత హృదయములందుండు చైతన్యమే తానగుట వలన సద్గురువు ఈశ్వరుడగుచున్నాడు. ఈ మూడును తానే అగుట వలన ,మూడింటికిని అతీతుడు కావున గురువు సాక్షాత్తు పరబ్రహ్మము .అందువలన గురువునకు నమస్కారము.
|
|
|
|
|
Logged
|
|
|
|
suma
Newbie

Posts: 47
|
 |
« Reply #25 on: July 29, 2009, 07:57:39 PM » |
|
శ్లోకం : అత్రినేత్ర శ్శివస్సాక్షాద్విబాహుశ్చ హరిః స్మృతః | యోచతుర్వదనో బ్రహ్మా శ్రీ గురుః కధిత ప్రియే ||
భావం: శివుడు త్రినేత్రుడు .రెండు స్థూల నేత్రములు, మధ్య జ్ఞానమనెడు మూడవ నేత్రము గలవాడు. జ్ఞాన నేత్రమనిన సర్వము తన చైతన్య రూపమే అను జ్ఞానము. అట్టి జ్ఞానము అన్యత్వము రూపుమాపుట వలన కామదులను నశింపజేయును. ఇదియే శివుడు మన్మధుని మూడవ నేత్రముతో నశింపజేసినట్లు చెప్పబడినది. తనలోని చైతన్యమునకన్యముగ ఏదియును లేదను జ్ఞానము మూడవ నేత్రముగా కలవాడు కనుక సద్గురువు శివస్వరూపుడగుచున్నాడు. గురుడు మానవునివలె రెండు చేతులు కలవాడుగ కనపడుచున్ననూ ,సకల సిద్ధులు ,సర్వ సమర్ధతలనెడి బాహువులు గల విష్ణువు ; తన సర్వ వ్యాపకత్వము వలన అతడు విష్ణువని చెప్పబడుచున్నాడు. నిజముగా నాల్గు వదనములు కలవాడు కాక పోయినప్పటికినీ బ్రహ్మ జ్ఞానమును కలిగియుండుట వలన గురువు బ్రహ్మయగుచున్నాడు;పరిమితుడుగా కనిపించినప్పటికినీ నిజమునకు అద్వితీయుడగు పరబ్రహ్మమే తానగుట వలన గురువు బ్రహ్మయని చెప్పబడుచున్నాడు.
|
|
|
|
|
Logged
|
|
|
|
suma
Newbie

Posts: 47
|
 |
« Reply #26 on: July 29, 2009, 08:33:54 PM » |
|
శ్లోకము: సకారః ప్రదమో వర్ణః మయాది గుణభాసకః |
రుకారోస్తి పరంబ్రహ్మా మాయాభ్రాంతి విమోచకం ||
భావము: గురు అనెడి పదమునందు గుకారము సృష్టికాధారమైన మాయ,త్రిగుణములను సూచించును. రుకారము వీటి కాధారమైన పరబ్రహ్మము. ఇది ' నేనుదేహమును ' మొదలుగాగల మాయభ్రాంతుల నుండి ముక్తినిచ్చును.
|
|
|
|
|
Logged
|
|
|
|
|