saimasterforums
 
*
Welcome, Guest. Please login or register. May 21, 2012, 03:07:18 AM


Login with username, password and session length


Pages: 1 2 »
  Print  
Author Topic: శ్రీ గురు గీత  (Read 319 times)
0 Members and 1 Guest are viewing this topic.
suma
Newbie
*
Posts: 47


« on: July 07, 2009, 12:16:58 PM »


శ్లోకం : గురు మధ్యే స్థితం విశ్వం విశ్వ మధ్యే స్థితో గురుః |

           గురుర్విశ్వం నచా న్యొస్థి  తస్మై శ్రీ గురవే నమః ||

భావం :మనస్సు నందు భావనలు, భావనలలో మనస్సు యెలా యిమిడి వున్నవో, అటులనే గురుడను విశ్వచైతన్యంలో భావన విశ్వము. మరియు ఆ భావన యందిమిడియున్నది ఆ గురుడను చైతన్యమే. అందువలన గురువే సకల విశ్వము . గురువునకన్యము మరేదియును  లేదు. కావున గురువునకన్యముగ దేనికిని నమస్కరించుటకు సాధ్యము కాదు. కనుక  అట్టి  గురువునకు నమస్కారము.

    
« Last Edit: July 23, 2009, 05:42:27 PM by suma » Logged
suma
Newbie
*
Posts: 47


« Reply #1 on: July 11, 2009, 09:16:45 AM »


శ్లోకం :దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాత్ గురు పదార్చనం |

    తాదృశ్య శైవ కైవల్యం నచతద్వ్యతిరేకిణః ||

 భావం: సాధకుడు తనకు అన్యముగా విశ్వము గోచరించినంతవరకు  సర్వము తానైన గురు పాదములను పూజించవలసినదే.ముక్తి  అటువంటి వారికిగాని తదన్యులకు కాదు.
« Last Edit: July 23, 2009, 05:43:01 PM by suma » Logged
suma
Newbie
*
Posts: 47


« Reply #2 on: July 12, 2009, 10:38:24 AM »


శ్లోకం : గురురేకో జగత్సర్వం  బ్రహ్మ విష్ణు శివాత్మకం |
         గురొః పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేద్గురుం ||

భావం : బ్రహ్మ విష్ణు శివాత్మకమగు జగత్తు అంతయు గురువే.  గురువు కన్న అధికము మరి ఏదియు లేదు .అందువలన ఆయనను పూజింపవలయును.


« Last Edit: July 23, 2009, 05:45:01 PM by suma » Logged
suma
Newbie
*
Posts: 47


« Reply #3 on: July 13, 2009, 06:29:38 PM »


శ్లోకం : శోషణం   భవ సింధోశ్చ దీపనం క్షర సంపదాం |

         గురొః పాదోదకం యస్య తస్మై శ్రీ గురవే నమః ||

భావం:ఏ గురువు యొక్క పాదోదకమనెడి జ్ఞానాజ్ఞి చేత జనన మరణ రూపమగు సంసార సముద్రమును ఆర్చి వేయు చున్నదో అదియే అశాశ్వతమైనట్టి లౌకిక సంపదలను కూడ సమృద్ధిగా ప్రసాదించుచున్నది .అట్టి గురువునకు నమస్కారము.
« Last Edit: July 23, 2009, 05:43:48 PM by suma » Logged
suma
Newbie
*
Posts: 47


« Reply #4 on: July 14, 2009, 07:37:25 PM »


శ్లోకం :అనేక జన్మ సంప్రాప్త  కర్మ బంధ విదాహినే|
    
          జ్ఞానానల  ప్రభావేన తస్మై  శ్రీ  గురవే నమః  ||

భావం: తన జ్ఞానాజ్ఞి చేత తనను స్మరించే వారిలో జ్ఞానాజ్ఞిని వెలిగించి దాని చేత అనేక జన్మల నుండి వారికి ప్రాప్తించిన కర్మ బంధములను దహించి వేయుచున్నాడో అట్టి  గురువునకు నమస్కారము.
« Last Edit: July 23, 2009, 05:47:09 PM by suma » Logged
suma
Newbie
*
Posts: 47


« Reply #5 on: July 15, 2009, 06:38:06 PM »


శ్లోకం : యదoఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వ తాప నివారకం
       తారకం భవ సింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం !!

భావం :ఏ గురువు యొక్క పాదద్వయము రాగ ద్వేష శీతోష్ణాది ద్వంద్వాల వలన కలిగిన తాపమును నివారించునో అటువంటి పాదములు కలవాడు ,సంసార సముద్రము నుండి తరింపజేయు వాడును అయినట్టి గురువునకు నమస్కరించుచున్నాను.

 
 
« Last Edit: July 23, 2009, 05:49:53 PM by suma » Logged
suma
Newbie
*
Posts: 47


« Reply #6 on: July 17, 2009, 06:35:51 PM »


శ్లోకం :అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే |
     సమస్త జగదాధార  మూర్తయే బ్రహ్మణే నమః !!

  భావం : నామ రూప గుణరహితుడగుట వలన చింతింపనలవి కాని వాడు , రూపము వ్యక్తముకాని వాడు, నిర్గుణుడయ్యు  గుణములన్నీ  తానే అయినవాడు ,త్రిగుణములు తానే అగుట  వలన త్రిగుణములచేత చేయబడిన సమస్త జగత్తునకు ఆధారమైనట్టి బ్రహ్మకు నమస్కారము (అనగా పరబ్రహ్మ స్వరూపుడైన గురువునకు నమస్కారము).
« Last Edit: July 23, 2009, 05:51:01 PM by suma » Logged
suma
Newbie
*
Posts: 47


« Reply #7 on: July 17, 2009, 06:46:39 PM »


శ్లోకం : సర్వ తీర్ధావ గాహస్య సంప్రాప్నోతి ఫలం నరః |
  
        గురొః పాదోదకం పీత్వ శేషం శిరశి ధారయన్!!

భావం : గురువుయొక్క పాదోదకమును పానము  చేసి శేషమును  శిరస్సున ధరించు నరుడు సర్వ తీర్ధములందు స్నానముచేసిన లేక సర్వ పుణ్యస్థలములను  దర్శించిన ఫలమును పొందును .
« Last Edit: July 23, 2009, 05:41:49 PM by suma » Logged
suma
Newbie
*
Posts: 47


« Reply #8 on: July 17, 2009, 06:48:16 PM »


శ్లోకం : అజ్ఞాన మూల హరణం జన్మ కర్మ నివారకం
        జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం గురోః పాదోదకం పిబేత్ !!

భావం : అజ్ఞానము యొక్క మూలమును నశింపజేయుటకు ,జ్ఞానవైరాగ్యములు సిద్ధించుటకు , జన్మ కర్మ నివారకములగు గురు పాదోదకమును పానము చేయవలెను.
« Last Edit: July 23, 2009, 05:52:38 PM by suma » Logged
suma
Newbie
*
Posts: 47


« Reply #9 on: July 18, 2009, 05:52:19 PM »


శ్లోకం : అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం |

      తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ||

భావం : (ఎవని చేత చరాచర జగత్తంతయు వ్యాపింపబడియున్నదో ఆయన ఆకారము అఖండ  మండలము .)
అట్టి స్థితి నాకు ఏ గురువు వలన తెలుపబడినదో అట్టి గురువునకు నమస్కారము.
« Last Edit: July 23, 2009, 05:54:07 PM by suma » Logged
suma
Newbie
*
Posts: 47


« Reply #10 on: July 18, 2009, 05:53:42 PM »

శ్లోకం : యస్మిన్ స్థితమిదం సర్వం భాతియద్భావ రూపత:
      యత్ప్రీత్యా  ప్రియం పుత్రాది తస్మై శ్రీ గురవే నమ: ||


భావం: ఈ సకల  జగత్తు ఎవని యందైతే వున్నదో ,ఎవని వెలుగు చేత భాసింపచేయబడుచున్నదో, ఎవని ఆనంద తత్వముచే పుత్రాదులు జీవులకు ప్రీతి పాత్రులగుచున్నారో అట్టి గురువునకు నమస్కారము.
« Last Edit: July 23, 2009, 05:56:16 PM by suma » Logged
suma
Newbie
*
Posts: 47


« Reply #11 on: July 19, 2009, 02:22:44 PM »


శ్లోకం : చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం
       అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమ: ||

భావం: చరాచరాత్మకమగు ముల్లోకములన్నియు దేనిచే వ్యాపించబడి వున్నవో అట్టి చైతన్యమయుడవు నీవెప్పుడు అయ్యి వున్నావు అని చెప్పుటయేగాక శిష్యునకు అనుభమును ప్రసాదించిన గురువునకు నమస్కారము.
« Last Edit: July 23, 2009, 05:57:07 PM by suma » Logged
suma
Newbie
*
Posts: 47


« Reply #12 on: July 20, 2009, 07:06:12 PM »



శ్లోకం : సపితా సచమే మాత సబంధు స్సచదేవతా |
      సంసార మోహనాశాయ తస్మై శ్రీ గురవే నమ: ||

భావం: అంతటా ఉన్న ఒకే చైతన్యమును అజ్ఞానముచేత గుర్తించలేక తల్లియని,తండ్రియని,బంధువులని,దేవతలని, వారి మీద సహజముగ వుండునట్టి ప్రేమనంతటిని ఒక్క గురునికే సమర్పించుట ఈ శ్లోకము  వివరించుచున్నది. గురువే తల్లిగను,తండ్రిగను, ప్రేమించుకొనుట  ఈ శ్లొకమందలి ఒక అంశము.
తల్లిదండ్రుల రూపమున వ్యక్తమగుచున్నది  సర్వవ్యాపియగు గురువొక్కడే అను యెరుక చేత తల్లిదండ్రుల యెడల  మానవుడనుభవించు వ్యామోహము నశింపచేసుకొనుట రెండవ అంశము. తన గురువు సన్నిధిలో తన  తల్లిదండ్రులను ఆకలి దప్పులను విస్మరించామని శ్రీ సాయి చెప్పినది స్మరణీయము.
« Last Edit: July 23, 2009, 05:58:36 PM by suma » Logged
suma
Newbie
*
Posts: 47


« Reply #13 on: July 22, 2009, 06:20:11 PM »


శ్లోకం : స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరం
      త్వం పదం దర్శితం యేన తస్మై  శ్రీ గురవే నమ: ||

భగవాన్ భరద్వాజ మహరాజ్ వివరణ: 'స్థావర జంగమాత్మకమైన ఈ జగతంతయూ వ్యాపించిన చైతన్య శక్తియే   నీవు '  అని శిష్యునకుపదేశించుటలో పైన చెప్పబడిన వేదాంత వాక్యములందు  రెండవ పదమును ఈ శ్లోకము వివరించుచున్నది. సద్గురువు అర్హులైన శిష్యులకు వాచా ఉపదేశించుటయే గాక ,అనుభవమునుగూడా ప్రసాదించగలడు. అట్టి అనుభవమును 'దర్శితం'అను పదము సూచించుచున్నది. ఈ విషయము సద్గురువు తప్ప మరెవ్వరునూ అనుభవపూర్వకముగా బోధింపజాలరు. కనుక తదన్యముగ ముక్తికి మార్గము లేదు కనుక ,సద్గురువే నమస్కరింపదగినవాడు.
« Last Edit: July 23, 2009, 06:01:12 PM by suma » Logged
suma
Newbie
*
Posts: 47


« Reply #14 on: July 23, 2009, 05:28:02 PM »


శ్లోకం:  కర్మణా మనసా వాచా  సర్వదా రాధయే ద్గురుమ్
     దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురు సన్నిధౌ||

   భావం:  మనస్సు , వాక్కు , కర్మలచేత గురువును ఆరాధింపవలసినది. సాష్టాంగముగ లజ్జ విడిచి గురు సన్నిధి యందు నమస్కరింపవలెను.మనస్సుతో ఆరాధించుట అనగా  నామస్మరణ మొదలగునవి.వాక్కు తో ఆరాధించుట అనగా మట్లాడవలసివచ్చినచో గురువుతో గాని ,గురువును గూర్చి గాని మాట్లాడుట అన్యమును గూర్చి సాధ్యమైనంతవరకు మాట్లడ కుండుట.ఆదరణ రూపమున సేవించుట అనగా ఈ దేహేంద్రియములన్నియు  గురువునకు శుశ్రూష చేయుటకు గురు ఆజ్ఞ పాలనమునకు గురువునకు ప్రీతికరమైనవి ఆచరించుటకు మాత్రమే వాడవలసిన పవిత్రమైన పూజా పాత్రలుగా భావించి తుచ్ఛ విషయముల నిమిత్తము వాటిని వినియోగించి మలిన పరచకుండుట ఆ భావన చెదరకుండా సర్వజీవులను గురు రూపములుగనే భావించి సేవించుట -పూజ భజనాదికములయందు   శరీరమును వినియోగించుట.
« Last Edit: July 23, 2009, 06:02:30 PM by suma » Logged
Pages: 1 2 »
  Print  
 
Jump to:  

Powered by MySQL Powered by PHP Powered by SMF 1.1.15 | SMF © 2011, Simple Machines

All information in these boards is copyrighted to Sri Ekkirala Dwarakanath Jnaneswar.
Valid XHTML 1.0! Valid CSS! Based onDilber MC Theme by HarzeM And customized by Sai Master Forums Team