|
Srusti.M
|
 |
« on: February 12, 2009, 05:04:56 PM » |
|
Hello Everyone,
Today onwards, I will be posting Quotes from Sai Sookthi and Acharya Vani every Thursday.
Dwaraka Uncle, please bless me to do this Seva.
1) సాయి సూక్తి: భక్తి పొరలి పొంగే హృదయంతో సాయి, సాయి అనుకో!
ఆచార్య వాణి: తలచిన హృదయాలలో ఆరని మంటలనార్పి తీయని ప్రేమను కురిసే నామం సాయి.
|
|
|
|
« Last Edit: February 12, 2009, 07:49:09 PM by asterias »
|
Logged
|
"We should not bother about a wish that Baba did not fulfill because we should believe that he did it for our own good. We need strong faith in Baba to believe that he does things for our own good."
|
|
|
|
Kalpana
|
 |
« Reply #1 on: February 12, 2009, 09:45:10 PM » |
|
Jai Sai Master,
Wonderful job Srushti.
Kalpana
|
|
|
|
|
Logged
|
|
|
|
|
sairamalakshmi
|
 |
« Reply #2 on: February 13, 2009, 09:27:21 AM » |
|
Om Samartha Sadguru Sainathaya Namaha
Good Luck Srushti.
Master Garu Sharanam Amma Garu Sharanam Swamy Garu Sharanam
|
|
|
|
|
Logged
|
|
|
|
|
Srusti.M
|
 |
« Reply #3 on: February 19, 2009, 06:17:47 PM » |
|
2) సాయి సూక్తి: నా ఆధ్యాత్మిక ధనాగారాలు నింపుకోండి.
ఆచార్య వాణి: ధనాన్ని ఎంత ప్రీతిగా (కూడబెట్టుకుంటున్నామో)నింపుకుంటున్నామో అంత కంటే ప్రీతిగా ఆధ్యాత్మిక ధనాన్ని నింపుకోమంటున్నారు బాబా. "నింపుకోవాలి" అంటే ఖాళీ ఉండాలి కదా ! అనగా సద్గురువు లీలలు, బోధలు, వారి, ఆశ్రిత భక్తవత్సలత సదా అనుభవం అవుతూ వుండా లంటే, రాగ, ద్వేష, అసూయాది భావాలను, ఎప్పటికప్పుడు (ఖాళీ చేస్తూ వుంటే) వెడలగొట్టుకుంటూ వుండాలి. అప్పుడు సద్గురు కృపతో హృదయం నిండుతూ వుంటుంది.
|
|
|
|
« Last Edit: February 20, 2009, 07:36:01 AM by Srusti.M »
|
Logged
|
"We should not bother about a wish that Baba did not fulfill because we should believe that he did it for our own good. We need strong faith in Baba to believe that he does things for our own good."
|
|
|
|
Srusti.M
|
 |
« Reply #4 on: February 26, 2009, 07:00:52 AM » |
|
3) సాయి సూక్తి: నిరంతరం ద్యానం వలన మనసు స్థిరమౌతుంది
ఆచార్య వాణి: మనకు ప్రియమైన దానిని గురించి అతిగా ఆలొచిస్తాం. వద్దనుకొన్నా మన మనస్సు లొకి ఆ ప్రియమైనది సదా గుర్తుకు వస్తూనే వుంటుంది. సద్గురువు మీద ప్రీతి, ఆయన చేసిన మేలు పై కృతజ్ఞత ధృఢంగా మనలో పాదుకొని వుంటే నిరంతర ధ్యానం దానికదే సిద్ధిస్తుంది.
|
|
|
|
|
Logged
|
"We should not bother about a wish that Baba did not fulfill because we should believe that he did it for our own good. We need strong faith in Baba to believe that he does things for our own good."
|
|
|
|
Srusti.M
|
 |
« Reply #5 on: March 05, 2009, 07:52:41 PM » |
|
4) సాయి సూక్తి: ఉపదేశాల కొసం పాకులాడవద్దు.
ఆచార్య వాణి: మనం ఎక్కడొ దురంగా పున్నాడని భ్రమించే భగవంతుడు, దగ్గరలొనే సద్గురువు రూపంలొ పున్నాడనే (ఉప) అనుభవాన్ని (దిశ) ప్రసాదించగలరు శ్రీసాయి. ఆ అనూభవాన్ని సదా మనసులొ స్థిరముగా నిలుపుకొని జీవించటమే నిజమైన మననము.(మంత్రము)
|
|
|
|
|
Logged
|
"We should not bother about a wish that Baba did not fulfill because we should believe that he did it for our own good. We need strong faith in Baba to believe that he does things for our own good."
|
|
|
|
Srusti.M
|
 |
« Reply #6 on: March 12, 2009, 08:48:55 PM » |
|
5)సాయి సూక్తి: సదా నన్ను ప్రేమతొ తలచుకుంటూ వుండు. అంతు లేని ఆనందం లభిస్తుంది.
ఆచార్య వాణి: ఈ తలచుకొవటం అనేక రకాలు.కొరికలు తీర్చమనొ,లేక తాననుకొన్నది కావాలనొ బాబాను తలచడం. అలా కాక ఆయన నన్ను సదా వెంట వుండి కాపాడుతూ వున్నాడు, నా రక్షకుడు, ఆయన లేక నేను లేను, అని చింతించడం నిజమైన భక్తియోగ పరాకాష్ట - గాయం మానినా కూడ బాగోజి సాయి చేతికి నూనె రాసి ఆకు కట్టడంలోని అంతరార్ధము ఇదే! అట్టి ప్రేమ భావమే భక్తి యోగంలో పరాకాష్టత చెందిన భక్తుని హృదయ నివేదన.
|
|
|
|
|
Logged
|
"We should not bother about a wish that Baba did not fulfill because we should believe that he did it for our own good. We need strong faith in Baba to believe that he does things for our own good."
|
|
|
|
Srusti.M
|
 |
« Reply #7 on: March 19, 2009, 07:54:19 PM » |
|
6)సాయి సూక్తి: "అల్లా మాలిక్."
ఆచార్య వాణి: సచ్చిష్యుడు తన గురువు యొక్క మహిమను, కీర్తిని చెప్పు కొంటాడు. అలా చేయటం వలన తన గురువు పట్ల భక్తిబావం నిలుస్తుంది, తన నుంచి పనికి వచ్చే గుణము, పనికి వచ్చేమాట ఏది వెలువడ్డా, అది తన "గురు కృప" వల్లనేనని అవతలి వాడికి తెలుస్తుంది. ప్తెగా నా గురువు చలవ వల్ల, వారి ఆశీస్సుల వల్ల మత్రమే యిది వచ్చిందని చెప్తాడు. "నేను చెబుతున్నాను" అని అనడు. అది సచ్చిష్యుని లక్షణం
|
|
|
|
« Last Edit: March 20, 2009, 06:22:22 AM by Srusti.M »
|
Logged
|
"We should not bother about a wish that Baba did not fulfill because we should believe that he did it for our own good. We need strong faith in Baba to believe that he does things for our own good."
|
|
|
|
Srusti.M
|
 |
« Reply #8 on: March 26, 2009, 05:31:22 PM » |
|
7)సాయి సూక్తి: నా కెవ్వరి మీద కోపం రాదు. తల్లికి బిడ్డపై కోపం వస్తుందా!
ఆచార్య వాణి: అసలు ఆయనకు (సాయికి) మనపై కోపం యేమిటి? ఋణము, శతృత్వము, హత్య వీటికి పరిహరము చెల్లించక తప్పదంటున్నారు సాయి. పైగా కర్మ ఫలితం అనుభవించక తప్పదంటున్నారు అవి అనుభవానికి వచ్చినప్పుడు తట్టుకోలేక బాబా యిలా చేస్తున్నాడేమిటి అనుకొంటాము. ఆయనను ఆశ్రయించినంతనే వాటిని తొలగిస్తానని అన లేదు సాయి. అనన్యంగా శరణు పొందితే ఎలా చక్కబరచగలనో చూడు అన్నారు. అలా శరణు పొందటం ముందుగా మన తత్వం కావాలి.
|
|
|
|
|
Logged
|
"We should not bother about a wish that Baba did not fulfill because we should believe that he did it for our own good. We need strong faith in Baba to believe that he does things for our own good."
|
|
|
|
Srusti.M
|
 |
« Reply #9 on: April 09, 2009, 09:11:18 PM » |
|
8]సాయి సూక్తి: శాస్త్ర షట్కం అక్కర్లేదు. సద్గురువు దృష్టే శిష్యునికి అన్న పానీయాలు.
ఆచార్య వాణి: సద్గ్రంథ పటనము కూడా సద్గురువు యొక్క అనుగ్రహంతోనే సార్దకమవుతుంది.ఆయన మీద ప్రీతి, భక్తి మనలను ఆయన అనుగ్రహా నికి పాత్రులను చేస్తుంది. అలా కాకుంటే మనకెంతో తెలుసునన్న భ్రమలో పడి, ఆ గ్రంథంలో వారు ఏమి చెప్పారు అని గాక, చెప్పినది, రైటా,తప్పా? అనే మీ మాంసలో పడి సద్గురువుపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి యేర్పడుతుంది.
|
|
|
|
|
Logged
|
"We should not bother about a wish that Baba did not fulfill because we should believe that he did it for our own good. We need strong faith in Baba to believe that he does things for our own good."
|
|
|
|
Srusti.M
|
 |
« Reply #10 on: April 16, 2009, 05:11:26 PM » |
|
9)సాయి సూక్తి: "వీడు నా స్థానమాక్రమించాలని" చూస్తున్నాడు. (బాపూ సాహెబ్ జోగ్ తో బాబా చెప్పిన మాట)
ఆచార్య వాణి: అతీతమైన స్థితులను ప్రసాదించగల సామర్థ్యం సద్గురువుల కుంటుందని తోస్తుంది. కాని దానిని పొంది నిలుపుకొనే సామర్థ్యం, సచ్చిష్బులకే వుంటుంది. అట్టి సామర్థ్యం లేకుండానే ప్రతి భక్తుడు సాయి వంటి గురువును చేరగానే తాను యే వివేకానందుని వలెనో అయినానని కలలు గని, తర్వత నిరాశా, నిస్పృహలకు లోనై భక్తిని కోల్వోయే ప్రమాద ముంది. అట్టివారు మరలా సామాన్య భక్తులు కావడానికి ఎన్నో జన్మలు పడుతుంది.
|
|
|
|
|
Logged
|
"We should not bother about a wish that Baba did not fulfill because we should believe that he did it for our own good. We need strong faith in Baba to believe that he does things for our own good."
|
|
|
|
Srusti.M
|
 |
« Reply #11 on: April 23, 2009, 07:11:25 PM » |
|
10)సాయి సూక్తి: మనము ఒకరినన్నా ఆశ్రయించాలి. ఇతరులకు మార్గమన్నా చూపాలి.
ఆచార్య వాణి: ఈ సూక్తిలో ఒక చమత్కారాన్ని చూపారు బాబా. ముందు మనము సద్గురువును ఆశ్రయించాలి. ఆయన కరుణ పొంది భ్రమర కీటక న్యాయం వలె అవ్వాలి. తర్వత ఆ సద్గురువు ఆదేశంతో ఇతరులకు మార్గన్ని చూపాలి. దానికి ఉదాహరణ గా భగవదాదేశం వల్ల తాను అవతార కార్యం నిర్వహిస్తున్నట్లు తోటమాలి - మంచి బాట (ప్రబోధామృతం) కథలో బాబా చెప్పారు.